Breaking News

సొంత ఆదాయాల పెంపుపై పంచాయతీలు దృష్టి పెట్టాలి

Published on Tue, 04/25/2023 - 08:32

 సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు ఉపయోగించుకుంటూనే సొంత ఆదాయాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఎ.సూర్య­కుమారి సూచించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 27 పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులను కమిషనర్‌ సన్మానించి అవార్డులను అందజేశారు.

పేదరిక నిర్మూలన–­ఉపాధి అవకాశాల కల్పన, హెల్దీ పంచాయతీ, చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్‌ సఫిషియెంట్‌ పంచాయతీ, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీ, సెల్ఫ్‌ సఫిషియెంట్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ పంచాయతీ, సోషియల్లీ సెక్యూర్డ్‌ పంచాయతీ, పంచాయతీ విత్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని పిలు­పునిచ్చారు.

కాగా, జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైనవారు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ అదనపు కమిషనర్‌లు సుధాకర్‌రావు, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: చంద్రబాబూ సిగ్గు.. సిగ్గు )

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)