Breaking News

ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు?

Published on Sun, 09/28/2025 - 05:18

ఏలూరు (మెట్రో): ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు, నాలుగు డీఏలు, మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ ఆసోసియేషన్‌ (జేఏసీ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్‌ సెక్రటరీ పలిశెట్టి దామోదర్‌  ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం చంద్రబాబుఉద్యోగులపట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్ధంకావడంలేదన్నారు. శనివారం ఏలూరులో రెవెన్యూ అసోసియేషన్‌ నాయకుడు తోట సుధాకర్‌ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అనేక హామీలిచ్చారని, వాటిని అమలుచేయడానికి మాత్రం ముందుకు రావడంలేదని మండిపడ్డారు. పీఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడంలేదన్నారు. అలాగే, దశలవారీగా బకాయిలు ఇస్తామన్నారని, అదీ లేదని చెప్పారు. 

ఉద్యోగులపట్ల కూటమి నాయకులకు ఎందుకు చిన్నచూపని వారు ప్రశ్నించారు. ఉద్యోగులు కోరుకున్న 12వ పీఆర్‌సీ, 2023 జూలైలో వేయాల్సిన పీఆర్సీని నేటికీ వేయలేదని నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం నాలుగు డీఏలు ఇవ్వాలని, జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దసరాకి ఒక్క డీఏ అయినా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు.  

గ్రాట్యుటీ, మెడికల్‌ బిల్స్‌ రావు.. 
ఇక రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రాని పరిస్థితి ఉందని వారు వివరించారు. రిటైరైన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రాకుండానే వారు చనిపోతున్నారని బొప్పరాజు, వలిశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు ఆక్రోశం, ఆవేదనతో ఉద్యమబాట పట్టక ముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి దసరాకి ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ నేతలు పాల్గొన్నారు.   

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)