Breaking News

అన్నదాతలకు వాయు‘గండం’..

Published on Sun, 09/01/2024 - 04:53

సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్‌ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్‌ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.

13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై  తీవ్ర ప్రభావం చూపాయి.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)