Breaking News

గిరిజన గురుకులాల్లో టీచర్లు అవుట్‌!

Published on Tue, 10/14/2025 - 05:46

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని 191 గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా దగా చేసింది. వీరి స్థానాల్లో సోమవారం డీఎస్సీ ద్వారా ఎంపికైన రెగ్యులర్‌ టీచర్లను విధుల్లోకి తీసుకుంది. దీంతో మొత్తం 1,143 మంది అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు రోడ్డునపడ్డారు. తమ పరిస్థితి ఏమిటంటూ వీరు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి మొరపెట్టుకున్నారు. 

మీ పోస్టుల్లో రెగ్యులర్‌ టీచర్లను నియమించామని, మిమ్మల్ని ఏమి తీసేయ్యలేదు కదా? అని మంత్రి బదులిచ్చారు. అయితే, ‘మీరేమో ఇలా చెబుతున్నారు.. గురుకులాల్లోని ప్రిన్సిపాల్స్, అధికారులు మాత్రం శాంక్షన్‌ పోస్టుల్లో రెగ్యులర్‌ టీచర్లు చేరారని, అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు కొనసాగించలేమని పంపేశారు’.. అని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచి్చన హామీని మంత్రికి గుర్తుచేశారు. మంత్రి అసహనానికి గురై వారిని బయటకు పంపించేశారు. దీంతో బాధిత టీచర్లు అక్కడే రోడ్డుపై కొద్దిసేపు నిరసన వ్యక్తంచేశారు. 

పోరుబాటకు సమాయత్తం..  
మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈనెల 15న విజయవాడలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నా­య­క్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్‌ తెలి­పారు.    

ఎస్టీ కమిషన్‌ సిఫార్సులు గాలికి.. 
గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని జాతీ­య ఎస్టీ కమి­షన్‌ ఇటీవల చేసిన సిఫార్సులను సైతం కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఎన్నికల ముం­దు కూటమి నేతలు ఇచ్చిన హామీ అమలుచేయకుండా ఆ పోస్టులను డీఎస్సీలో చూప­డంతో గతేడాది నవంబరులో వీరు రోడ్డె­క్కారు. 

మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపి ఉద్యోగ భద్రత కల్పిస్తా­మని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. అయి­తే, ఇవేవీ అమలుచేయకపోవడంతో బాధితులు జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. వారిని తొలగించవద్దని, ఉద్యోగ భద్రత కల్పించాలని చేసిన సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)