Breaking News

కర్నూలులో ఓరియంట్‌ ఫ్లైట్స్‌ పైలెట్‌ శిక్షణ కేంద్రం

Published on Fri, 03/15/2024 - 03:59

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తొలి పైలెట్‌ శిక్షణ కేంద్రం కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏర్పాటవుతోంది. ఫ్లైయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేయడానికి ఓరియంట్‌ ఫ్లైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుమతిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ ఉత్తర్వులిచ్చింది. పైలెట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఏడీసీఎల్‌) టెండర్లు పిలవగా మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.

ఇందులో రిత్విక్‌ ఏవియేషన్, ధిల్లాన్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌లు నిర్దేశిత నిబంధనల అర్హతలను అందుకోలేకపోయాయి. ఏపీఏడీసీఎల్‌ ప్రతీ విమానానికి గంటకు కనీస ఆదాయంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధన విధిస్తే.. ఓరియంట్‌ ఏవియేషన్‌ దానికి అదనంగా రూ.750 చెల్లించడానికి ముందుకొచ్చింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఓరియంట్‌ ఏవియేషన్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు.

సంవత్సరానికి 100 మంది వరకు శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.155 కోట్ల­తో ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేస్తున్న ఉయ్యా­­లవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో సుమారు రూ.30 కోట్లతో పైలె­ట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. దీర్ఘకాలిక లీజు విధానంలో తొలుత 20 ఏళ్లకు ఆ తర్వాత పరస్పర అంగీకారంతో మరో పదేళ్లు పొడిగించుకునేలా ఈ ఎఫ్‌టీవోని ఏర్పాటు చేస్తున్నారు.

ఏడాదికి కనీసం 80 నుంచి 100 మందికి పైలెట్‌ శిక్షణ ఇచ్చేలా ఈ ఎఫ్‌టీవోని ఏర్పా­టు చేస్తున్నారు. కేవలం విమాన సర్వీసులే కాకుండా కర్నూలు ఎయిర్‌పోర్టును ఆధా­రం చేసుకుని పైలెట్‌ శిక్షణ, పారాగ్లైడింగ్, ఎంఆర్‌వో యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా విమానాశ్రయ ఆదాయం పెంచే మార్గాలను ఏపీఏడీసీఎల్‌ పరిశీలిస్తోంది.

#

Tags : 1

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)