Breaking News

సేంద్రియ మత్స్య ఉత్పత్తులను ప్రోత్సహించాలి 

Published on Sat, 07/29/2023 - 05:01

సాక్షి, అమరావతి: సమాజంలో ప్రతి ఒక్కరు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోందని, ఎలాంటి రసాయన అవశేషాల్లేని సముద్ర మత్స్యఉత్పత్తులను కూడా సేంద్రియ ఉత్పత్తులుగానే పరిగణించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్స్‌ సహకారంతో విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడురోజులు నిర్వహించే 2వ దక్షిణ భారత స్థాయి సీఫుడ్‌ ఫెస్టివల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నంబర్‌–1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సగటు వినియోగం ఎనిమిది కిలోలకు మించడం లేదన్నారు. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్‌ ఆంధ్ర–ఫిట్‌ ఆంధ్ర బ్రాండింగ్‌తో హబ్స్‌ అండ్‌ స్పోక్స్‌ మోడల్‌లో పెద్ద ఎత్తున మార్కెటింగ్‌ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్వాహబ్, దానికి అనుబంధంగా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 1,400 అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశామని, మరో రెండువేల అవుట్‌లెట్స్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఔత్సాహికులు ముందుకొస్తే 40 నుంచి 60 శాతం సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయడమేగాక ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని రకాల చేయూత అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం, మాంసాహార ప్రియుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సీఫుడ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరాల్లో నిర్వహించిన ఫెస్టివల్స్‌కు అనూహ్య స్పందన లభించిందన్నారు.

విజయవాడలో నిర్వహిస్తున్న ఫెస్టివల్‌లో  రూ.699కి అన్‌లిమిటెడ్‌ సీఫుడ్‌ బఫెట్‌ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాల్లో సీఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫిష్‌ ఆంధ్ర ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఆవిష్కరించారు. మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, ఏఎఫ్‌సీవోఎఫ్‌ చైర్మన్‌ కె.అనిల్‌బాబు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్, మత్స్యశాఖ అదనపు డైరెక్టర్‌ అంజలి, జేడీలు వి.వి.రావు, హీరానాయక్‌ పాల్గొన్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)