Breaking News

కాంట్రాక్టర్లకు వరం ఖజానాకు సున్నం

Published on Tue, 02/11/2025 - 04:05

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల టెండర్లలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ వంటి పారదర్శక, అవినీతి రహిత విధానాలు రద్దయిపోయాయి. ఇష్టారీతిన నిబంధనల సడలింపులు, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాను దోచి పెట్టి కమీషన్లు దండుకొనే పద్ధతులు వచ్చేశాయి. ఇందులో భాగంగా తాము కోరుకొనే బడా కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా తాజాగా నిబంధనలు రూపొందించారు.

 కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో పనులు దక్కించుకునేలా బిడ్‌ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 2 ఏఎన్‌–బీ నుంచి 3 ఏఎన్‌–బీగా సడలించే ప్రతిపాదనపై మంత్రివర్గంతో ఈనెల 6న ఆమోద ముద్ర వేయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ద్వారా రూపొందించిన టెండర్‌ విధానంలో బిడ్‌ కెపాసిటీని మార్చుతూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నెంబరు 4) జారీ చేశారు.

విదేశీ రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు మినహా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌), జల్‌జీవన్‌ మిషన్‌ సహా అన్ని శాఖల ద్వారా చేపట్టే పనులకు జారీ చేసే టెండర్‌ నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు దక్కించుకున్న పనులను ఆ టెండర్‌ నిబంధనల్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయకపోవడం వల్ల వాటి అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది.

అయినా అదే కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో మరిన్ని పనులు అప్పగించేలా నిబంధనలను సడలించడంపై ఇంజినీరింగ్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అడిగినంత కమీషన్‌ ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టడానికే బిడ్‌ సామర్థ్యం లెక్కించే ప్రతిపాదనను సడలించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టేందుకే..
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణం రూ.15 వేల కోట్లతో చేపట్టిన పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 2024 ఏప్రిల్‌ 1 నాటికి ఒప్పంద విలువలో 25 శాతం లోపు పూర్తయిన పనులను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తవి చేపట్టేందుకు సిద్ధమైంది. జల వనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు – మౌ­లిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలో పలు పనులు చేపడుతోంది.

అడిగినంత కమీషన్‌ ఇ­చ్చే కాంట్రాక్టర్లకే కట్టబెట్టి వాటి ఒప్పంద విలువలో ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పి, అందులో 8 శాతా­న్ని కమీషన్‌గా రాబట్టుకోవడానికి స్కెచ్‌ వేశా­రు. ఈ క్రమంలోనే బిడ్‌ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 3 ఏఎన్‌–బీగా మార్చారు. ఈ నిబంధనలో ‘ఏ’ అంటే గత ఐదేళ్లలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా పనులు పూర్తి చేసి, పురోగతిలో ఉన్న పనుల విలువ. ‘ఎన్‌’ అంటే టెండర్‌ నోటిఫికేషన్‌లో ఆ పని పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం. ‘బీ’ అంటే ఆ కాంట్రాక్టర్‌ అప్పటికే దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల వి­లువ.

ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్‌ పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా రూ.1000 కోట్ల విలువైన పను­లు చేశారనుకుందాం. ప్రస్తుతం టెండర్‌ పిలిచిన పనిని రెండేళ్లలో పూర్తి చేయాలని ని­బంధన పెట్టా­­రనుకుందాం. అప్పటికే ఆ కాంట్రాక్టర్‌ దక్కిం­చుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ రూ.500 కోట్లు అనుకుందాం. అప్పుడు 3 ఏఎన్‌–బీ కింద ఆ కాంట్రాక్టర్‌కు రూ.5,500 కోట్ల విలువైన పనులు దక్కించుకోవడానికి అర్హత వస్తుంది. అదే 2 ఏఎన్‌–బీ కింద అయితే ఆ కాంట్రాక్టర్‌కు రూ.3,500 కోట్ల విలువైన పనులకే అర్హత ఉంటుంది.

పనుల్లో జాప్యం.. ఖజానాపై తీవ్ర భారం  
సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి పథకాలతోపాటు వివిధ విభాగాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోగా పనులు పూర్తి చేయడంలేదు. తీవ్ర జాప్యం జరుగుతోంది. సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్‌ తదితర ధరలు పెర­గడం వల్ల అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. దీని వల్ల ఖజానాపై తీవ్రంగా భారం పడుతోంది. ప్రభుత్వ తాజా నిబంధన వల్ల రూ.వంద కోట్ల విలువైన పనులను రెండేళ్లలో పూర్తి చేయలేక చతికిలబడిన కాంట్రాక్టర్‌కే కొత్తగా రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు దక్కుతాయి.

వీటినీ రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రభు­త్వం నిబంధనను సడలించింది. రూ.100 కోట్ల పనులకే వనరులు సమకూర్చుకోలేక, ఏళ్ల కొద్దీ జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు.. అంతకంటే పదింతల పనిని ఎలా చేయగలుగుతారని ఇంజినీర్లు అంటున్నారు. ఫలితంగా ఆ పనుల ఫలితాలను ప్రజలకు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతోపాటు ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భా­రం పడుతుందని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)