Breaking News

స్థానిక సచివాలయాలు.. ఇక మూడు కేటగిరీలు

Published on Fri, 04/11/2025 - 04:48

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురు­వారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల కేటగిరీని బట్టి సిబ్బంది సంఖ్యను సైతం నిర్ధారించింది. 2,500లోపు జనాభా ఉండే సచివాలయాలను ‘ఏ’ కేటగిరీ, 2,501 నుంచి 3,500లోపు జనాభా ఉండే సచివాలయాలను ‘బీ’, 3,501కు మించి జనాభా ఉన్న సచివాలయాలను ‘సీ’ కేటగిరీలో చేర్చింది. ఏ కేటగిరీ సచి­వాలయాలకు ఆరుగురు సిబ్బందిని కేటాయించగా.. ఇందులో ఇద్దరు సాధారణ, నలుగురు నిర్ది­ష్ట విధులకు వినియోగించాలని నిర్దేశించింది. 

బీ కేటగిరీ సచివాలయాలకు ఏడుగురు సిబ్బందిని కేటా­యించగా.. వీరిలో ముగ్గురు సాధారణ, నలుగురు నిర్దిష్ట విధులకు వినియోగించాలని పేర్కొంది. సీ కేటగిరీ సచివాలయాలకు 8 మంది సిబ్బందిని కేటాయించగా.. వీరిలో నలు­గుర్ని సాధారణ విధులకు, మరో నలుగుర్ని నిర్దిష్ట విధుల కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా అమ­లు చేయడానికి వీలుగా సచివాలయాలను, సిబ్బందిని హేతుబద్దీకరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సిబ్బంది విధులు ఇలా.. 
» గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీరాజ్‌ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్‌ నిర్వర్తిస్తారు. 
»   పట్టణాల పరిధిలోని వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి, వార్డు మహిళా పోలీస్‌ నిర్వర్తిస్తారు.  
»    గ్రామ సచివాలయాల్లో నిర్దిష్ట విధులను గ్రామ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, వ్యవసాయ అసిస్టెంట్, వెట­ర్నరీ అసిస్టెంట్, ఇంధన అసిస్టెంట్‌ నిర్వర్తిస్తారు.  
»  వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట విధులను రెవెన్యూ కార్యదర్శి, హెల్త్‌ కార్యదర్శి, ప్లానింగ్‌–రెగ్యులేషన్‌ కార్యదర్శి, సౌకర్యాల కార్యదర్శి, పారిశుధ్య–పర్యావరణ కార్యదర్శి, ఇంధన కార్యదర్శి నిర్వర్తిస్తారు. 

కేటగిరీల వారీగా విధులు ఇలా.. 
»  ఏ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీరాజ్‌ కార్యదర్శి, సంక్షేమ విద్య అసిస్టెంట్‌ లేదా మహిళా పోలీస్‌ నిర్వర్తిస్తారు. 
»   పట్టణాల్లోని ఏ కేటగిరీ వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను పరిపాలన కార్యదర్శి లేదా విద్య–డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి లేదా మహిళా పోలీస్‌ నిర్వర్తిస్తారు.  
» బీ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్‌ లేదా మహిళా పోలీస్, పట్టణాల్లోని బీ కేటగిరీ వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను పరిపాలన కార్యదర్శి, విద్య–­డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, సంక్షేమ–అభి­వృద్ధి కార్యదర్శి లేదా మహిళా పోలీస్‌ నిర్వర్తిస్తారు. 
»   సీ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధు­లను పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్, మహి­ళా పోలీస్‌ నిర్వర్తిస్తారు. పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, వార్డు సంక్షేమ–­అభివృద్ధి కార్యదర్శి, మహిళా పోలీస్‌ నిర్వర్తిస్తారు. 
»  ఇందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాల­యాల్లో సాధారణ విధులు నిర్వర్తించే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.  
» నిర్దిష్ట విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించి విడిగా ఉత్తర్వులిస్తామని పేర్కొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)