Breaking News

AP Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. 

Published on Mon, 11/29/2021 - 13:14

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్‌ అలర్ట్‌  చేసింది. నాలుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా. కానీ ప్రస్తుతం బ్యాంకాక్‌ సమీపంలో ఉండడంతో అండమాన్‌ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఏపీలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు.  

 చదవండి: ఒమిక్రాన్‌ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో..,

తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో మదురై, విరుదునగర్‌ జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు ఉందని  విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో చెక్‌డ్యాంల నుంచి వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా నేడు రేపు  పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకి 40 కి.మీ. నుంచి 50 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)