Breaking News

పార్లమెంట్‌లో ‘అరుణో’దయం

Published on Sat, 09/30/2023 - 05:00

వెవీయూ: వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలోని అక్కాయపల్లెకు చెందిన ఆటోడ్రైవర్‌ హరిప్రసాద్, రమాదేవి దంపతుల కుమార్తె జానగొండ అరుణ పార్లమెంట్‌లో ఉపన్యసించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి అవకాశం 25 మందికి దక్కగా, ఏపీ నుంచి ఈమె ఒక్కరే ఉండటం విశేషం.గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి పురస్కరించుకుని అక్టోబర్‌ 2న నూఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో మహాత్మాగాంధీ జీవితచరిత్రపై అరుణ ప్రసంగించనుంది.

ఈమె కడపలోని శ్రీవివేకానంద మహిళా డిగ్రీ కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తిచేసి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఎంఎస్సీ (మ్యాథ్స్‌) చదువుతోంది. చిన్నప్పటి నుంచి కో–కరికులర్, ఎక్స్‌ట్రా–కరికులర్‌ యాక్టివిటీస్‌లో రాణిస్తోంది. ఈమె విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తి చేసింది. 2017లో ఇంటాక్‌ రీజినల్‌ పురస్కారాన్ని అందుకున్న ఈమె పలు వ్యాసరచన పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విజేతగా నిలిచింది.

నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ‘జాతీయ నాయకులకు నివాళి’ అనే కార్యక్రమంలో భాగంగా ‘మహాత్మాగాంధీ జీవనవిధానం, ఆయన అనుసరించిన పద్ధతులు: ప్రపంచంపై ఎనలేని ప్రభావం’, ‘అమృత్‌కాలంలో లాల్‌బహదూర్‌శాస్త్రి జీవితపాఠాలు’ అంశంపై ఎంపికలు జరిగాయి. జిల్లాస్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించగా, ఇందులో అరుణప్రతిభ కనబరచడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది. అరుణ మాట్లాడుతూ తనకు గాంధీ సిద్ధాంతాలు అంటే ఎంతో గౌరవమని, ఆయన మార్గాన్నిఅనుసరిస్తుంటానని..ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని తెలిపింది. కాగా, గతంలో కడపలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీకళాశాల విద్యార్థిని మిద్దె రూప ఇలాంటి అవకాశాన్ని దక్కించుకోగా ఇప్పుడు ఆ అవకాశం అరుణకు దక్కింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)