Breaking News

ఉల్లి రైతుకు ‘సిండికేట్‌’ దెబ్బ

Published on Sat, 09/14/2024 - 04:50

కర్నూలు (అగ్రికల్చర్‌)  : ఉల్లి ధరలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లికి డిమాండ్‌ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉల్లి గడ్డలకు డిమాండ్‌ పెరిగి ధర కూడా జోరు మీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మాత్రం ధరలు తగ్గుతున్నాయి.

మొన్నటి వరకు వర్షాల వల్ల ఉల్లి నాణ్యత దెబ్బతిని ధర లభించడం లేదు. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో గడ్డల నాణ్యత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో కర్నూలు మార్కెట్‌కు పోతే గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో వస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. 

సిండికేట్‌గా మారుతున్న వ్యాపారులు
వ్యాపారులు పథకం ప్రకారం ఉల్లి ధర పెరుగకుండా జట్టు కడుతున్నారు. సిండికేట్‌గా మారి ధరలపై ప్రభావం చూపుతున్నారు. గతంలో వేలంపాట ద్వారా కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు సైగలతో సిండికేట్‌ అయ్యేవారు. ప్రస్తుతం ఈ–నామ్‌లో టెండర్‌ ప్రాతిపదికన ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో 40 మంది వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. 

ఇందులో 30 మంది వ్యాపారులు భారీగానే ఉల్లి క్రయ, విక్రయాలు చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఉల్లి అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు తరలుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లికి డిమాండ్‌ ఉండటంతో కోల్‌కతా నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయమే వ్యాపారులు దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్డర్లు, ధరల ఆధారంగా సిండికేట్‌ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఏ ధర వరకు టెండరు వేయవచ్చనే విషయమై వ్యాపారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ–నామ్‌లో కూడా సిండికేట్‌గా మారి కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలో ఉల్లికి ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తే కర్నూలు మార్కెట్‌లో కనీసం రూ.5వేల వరకు ధర పలకాలి. కానీ రూ.3,600 మించడంలేదు. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకే లభిస్తోంది. 40 శాతం లాట్లకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి 2,500 వరకు మాత్రమే ఉంటోంది. మిగిలిన అన్ని లాట్లకు రూ.1000 నుంచి రూ.2వేల మధ్యనే ధర లభిస్తోంది. 

ధర తీవ్ర నిరాశకు గురి చేసింది 
ఒక ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి అంతంత మాత్రంగానే వచి్చంది. మార్కెట్‌లో దిగుబడిని విక్రయానికి తీసుకెళ్తే క్వింటాకు రూ.2,000 లోపు ధర లభించింది. ఈ ధర చాలా నిరాశకు గురిచేసింది. వ్యాపారులు పథకం ప్రకారం సిండికేట్‌గా మారి ధర పెరగకుండా చేస్తున్నారు.     – మద్దిలేటి, పర్ల, కల్లూరు మండలం  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)