Breaking News

వడ్డీ డబ్బుల కోసం దళిత మహిళను కట్టేసి కొట్టారు

Published on Sat, 12/06/2025 - 08:25

ఒంగోలు టౌన్‌: చంద్రబాబు సర్కారు పాలనలో రాష్ట్రంలో వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. అవసరమైనవారికి ఎక్కువ వడ్డీకి డబ్బులిచ్చి.. వసూళ్ల కోసం హింసిస్తున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అప్పు తీసుకున్న మహిళపై దాడిచేసి స్తంభానికి కట్టేసి కొట్టారు. సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించి బాధిత మహిళ, పోలీసుల కథనం ప్రకారం.. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వితంతు దళిత మహిళ దార్ల మాధురి ఒంగోలు నెహ్రూనగర్‌లో నివసిస్తోంది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. 

కుటుంబ అవసరాల కోసం మాధురి.. నెహ్రూనగర్లో వడ్డీ వ్యాపారం చేస్తున్న సురేఖ వద్ద రూ.100కు 10 రూపాయల వడ్డీ ప్రకారం రూ.20 వేలు అప్పు తీసుకొంది. మూడునెలల పాటు నెలనెలా రూ.2 వేల వంతున వడ్డీ చెల్లించింది. బుధవారం రాత్రి సురేఖ, ఆమె సోదరి శాంతి కలిసి మాధురి ఇంటికి వచ్చారు. వడ్డీ డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేశారు. దౌర్జన్యంగా మంచం మీద పడేసి గొంతుపిసికారు. చెవి కమ్మలను బలవంతంగా లా­క్కు­న్నారు. మాకు ఒంగోలు పోలీసులు, రౌడీలు తెలుసు.. నీ అంతు చూస్తాం.. అంటూ బెదిరించారు. మాధురి ఇంటి­లో­ని సామాన్లన్నిటినీ చెల్లాచెదురు చేశారు. జుట్టుప­ట్టుకొని బయటకు లాక్కెళ్లి ఇనుప స్తంభానికి కట్టేసి కొట్టారు. కాలనీవాసులు కొందరు సురేఖను, శాంతిని అడ్డుకున్నా­రు. దీంతో మాధురి చేత ఖాళీ ప్రామిసరీ నోట్లమీద సంతకాలు తీసుకుని వెళ్లిపోయారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)