Breaking News

కొనసాగుతున్న ఫిర్యాదులు, అరెస్టులు

Published on Sun, 11/17/2024 - 05:44

సాక్షి నెట్‌వర్క్‌: సీఎం చంద్రబాబు, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాజ­మహేంద్రవరం జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పీటీ వారెంట్‌పై శుక్రవారం అరెస్టు చేసిన ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీ­సులు శనివారం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్‌ విధించడంతో మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 

బోరుగడ్డ పోలీసుస్టేషన్‌లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలవారు స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అనిల్‌ ఫొటోలను వారు చెప్పులతో కొడుతూ దహనం చేశారు. గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న విశాఖ­పట్నానికి చెందిన బోడి వెంకటేష్‌ను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు పీటీవారెంట్‌పై అరెస్టు చేసి చీరాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయాదికారి రిమాండ్‌ విధించడంతో వెంకటేష్‌ను ఒంగోలు జైలుకు తరలించారు. 

వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఉండి మండలం ఉణుదుర్రు గ్రామానికి చెందిన గొర్రుముచ్చు సుందర్‌కుమార్‌ను శనివారం తెల్లవారుజామున ఉండి పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేశ్‌ను హిందూపురం వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

రాత్రి వరకు విచారించిన అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కృష్ణాజిల్లా అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు అందింది. సినీనటి శ్రీరెడ్డిపై గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)