ఆగిన బ్లోఅవుట్‌

Published on Sun, 01/11/2026 - 03:33

మలికిపురం: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఈ నెల 5న సంభవించిన భారీ బ్లోఅవుట్‌ మంటలను శనివారం ఉదయం 10.30 గంటలకు పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఆరు రోజుల శ్రమ ఫలించడంతో ఓఎన్‌జీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున మంటలు బాగా తగ్గడంతో నీరు చల్లుతూ సిబ్బంది వెల్‌ మౌత్‌ వద్దకు వెళ్లారు.

పరిస్థితిని అధ్యయనం చేసి దెబ్బతిన్న భాగాలను తొలగించి.. బ్లోఅవుట్‌ ప్లగ్‌ను ప్రత్యేక క్రేన్‌తో వెల్‌కు అమర్చడంతో గ్యాస్‌ మంటలు పైకి వెళ్లడం ప్రారంభమైంది. అనంతరం ప్లగ్‌ ద్వారా గ్యాస్‌ లీకేజీని అదుపుచేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అనంతరం విజయోత్సవాలు నిర్వహించుకున్న ఓఎన్‌జీసీ అధికారులు, సిబ్బంది, రెస్క్యూ టీమ్‌ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం 12 గంటలకు వెల్‌ మూసివేత చర్యలలో భాగంగా ప్రత్యేక యంత్రాల ద్వారా బావిలోకి మడ్‌ పంపింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు.

ఇది సమష్టి విజయం 
ఇరుసుమండ బ్లోఅవుట్‌ను ఆరు రోజులు శ్రమించి సమష్టి కృషితో అదుపు చేశాం. సిబ్బంది, రెస్క్యూ టీమ్‌ అహర్నిశలూ శ్రమించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా పూర్తిస్థాయిలో సహకరించారు. ప్రస్తుతానికి బ్లోఅవుట్‌ ప్లగ్‌ వేసి మూసేశాం. వెల్‌ను కూడా మడ్‌తో మూసివేశాం. తరువాత చర్యలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. – శంతన్‌దాస్, ఓఎన్‌జీసీ ఈడీ–కం–అసెట్‌ మేనేజర్, రాజమహేంద్రవరం

త్వరితగతిన మూసివేశాం 
బ్లోఅవుట్‌ మంటలను చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్‌ చేశాం. ఓఎన్‌జీసీకి సంబంధించిన సిబ్బంది సాంకేతికతతో పనిచేశారు. ఘటన సంభవించిన నాటినుంచి ఈ రోజు వరకూ అలుపెరగకుండా పని చేశాం. – గాజుల శ్రీహరి, ఇన్‌చార్జి, క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)