అదుపులోకి వచ్చిన ఓఎన్జీసీ బ్లోఅవుట్

Published on Sat, 01/10/2026 - 12:39

సాక్షి, అంబేద్కర్ కోనసీమ:  ఇరుసుమండలంలో నాలుగు రోజుల క్రితం సంభవించిన ఓఎన్‌జీసీ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. ‍మంటలను అదుపు చేయడానికి ఆంబ్రెల్లా ఆపరేషన్ చేపట్టడంతో పాటు గ్యాస్‌ సామర్థ్యం తగ్గడంతో అగ్నికీలల తీవ్రత తగ్గింది. దీంతో అక్కడికి ఉన్న ఓఎన్‌జీసీ సిబ్బంది కాలిన వ్యర్థాలను తొలిగించారు. మంటలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

జనవరి 5న అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలో ఓఎన్జీసీ మోరి బావి5లో భారీ బ్లోఅవుట సంభవించింది. ఓఎన్జీసీ సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ ఎగజిమ్మింది. దీంతో పెద్దఎత్తున 100 మీటర్ల పైకి మంటలు లేశాయి. అగ్నికీలల తీవ్రత చూసి బెంబేలెత్తిపోయిన రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.

అగ్నిప్రమాదం జరిగిన మోరి-5 నంబర్ బావి ఓఎన్‌జీసీ మోరి స్ట్రక్చర్‌ పరిధిలో ఉంది. భద్రతాకారణాలు సరిగ్గా లేకపోవడంతో 12 ఏళ్లక్రితమే దీనిని మూసివేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించడంతో  దీని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. కాగా ప్రస్తుతం మళ్లీ అక్కడే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)