Breaking News

ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరో గిరిజన విద్యార్థిని బలి

Published on Sun, 10/26/2025 - 04:49

సీతంపేట: ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో గిరిజన విద్యార్థి బలైంది. పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబండి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న మండంగి కవిత జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధిలో విశాఖ కేజీహెచ్‌లో శుక్రవారం మృతిచెందింది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ కవిత స్వగ్రామమైన డొంబంగివలసతోపాటు రాజుగాడి­గూడ, ఈతమానుగూడ, పూతికవలస, పుట్టిగాం, కోమటిగూడ, చీడిమానుగూడ, చింతమానుకాలనీ, గూడంగి కాలనీకి చెందిన గిరిజనులంతా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబంగి గేటు బయట తరలి వచ్చి మృతదేహంతో ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు మాట్లాడుతూ ‘గిరిజన విద్యార్థులు పిట్టల్లారాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?.. విద్యార్థుల ఆరోగ్యం పట్టదా?.. ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకపోవడం దా­రుణం.. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందితే వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ బాధ్యతగా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేíÙయా చెల్లించింది. కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తిరుపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లలో ఇప్పటి వరకు 21 మంది విద్యార్థులు చనిపోయారని, ఈ నెలలో వరుసగా ఆరుగురు మృతి చెందినా, సంబంధిత శాఖామంత్రి, ఎ­మ్మెల్యేలకు చీమకుట్టినట్టయినా లేదన్నారు.

జిల్లా­లోని వివిధ వసతిగృహాల్లో 15 వేల మంది బాలికలు చదువుతుంటే వీరిలో 30 శాతం మందికి సికిల్‌ సెల్‌ ఎనిమియా ఉందని రిపోర్టులు చెబుతున్నాయ­న్నారు. ఏడాదిన్నరగా దోమతెరల పంపిణీ లేదన్నారు. హాస్టల్‌ తలపులు, కిటికీలకు మెస్‌లు లేవని, తాగు­నీటి సమస్య వెంటాడుతుందని, సరైన మెనూ అందడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గిరి­జన ప్రాంతాలు అంటే నా ఆత్మ.. ఎక్కడైనా స్పందిస్తాన­న్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడంలేదో చెప్పాలన్నారు. గిరిజనుల మరణాల పట్ల దృష్టిసారించాలని, లేదంటే విద్యా­ర్థుల తల్లిదండ్రులతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

బాలిక కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేíÙయా, ఒకరికి ఉద్యోగం ఇ­వ్వాలని, గిరిజన బిడ్డల చావుకు ఆ శాఖమంత్రి సంధ్యారాణి వచ్చి సమాధానం చెప్పేవరకు మృతదేహాన్ని పాఠశాల నుంచి తరలించేది లేదని గిరిజన సంఘాల నాయకులు తెగేసి చెప్పారు. పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పాఠశాలకు వచ్చి గిరిజనులతో మాట్లాడా­రు.   విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకుంటా­మని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)