Breaking News

భరణం కోసం రుణం

Published on Sun, 11/02/2025 - 04:11

సాక్షి, అమరావతి: ఎన్నో ఆశలతో మూడుముళ్ల బంధంతో ఒకటైనవారు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఎక్కువకాలం కలిసి జీవించలేక విడిపోతున్నారు. విడాకులకు సంబంధించిన న్యాయప్రక్రియ కోసం సగటున వీరు రూ.5 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నారు. విడాకుల తర్వాత పురుషుల ఆర్థికస్థితి ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నట్లు వన్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ తాజా సర్వే వెల్లడించింది.  దేశవ్యాప్తంగా విడాకులు తీసుకున్న 1,258 జంటల ఆర్థిక స్థితిగతులను చూస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. 

దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..
»  38 శాతం మంది పురుషులు వారి వార్షిక ఆదాయమంతా భరణం కోసం వెచ్చిస్తున్నారు. 
»  42 శాతం మంది భరణం చెల్లించడం కోసం అప్పులు చేస్తున్నారు. 
»  29 శాతం మంది పురుషుల ఆస్తి మొత్తం భరణం చెల్లింపుల తర్వాత  మైనస్‌లోకి జారిపోతోంది. 
»  26 శాతం మంది మహిళలు భరణంగా వారి భర్త నుంచి ఆస్తి తీసుకుంటున్నారు. 
»  ఆస్తులు లేకపోయినా మెయింటెనెన్స్‌ చెల్లించాల్సిన పరిస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు. 
»  56 శాతం మంది మహిళలు విడాకులు తీసుకోవడంలో అత్తమామలను ప్రధాన కారణంగా చూపుతున్నారు. 
»  43 శాతం మహిళలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, గొడవలు ప్రారంభమై విడాకులు తీసుకోడానికి కారణమవుతున్నాయి. పురుషుల విషయంలో ఇది 42 శాతంగా ఉంది. 
»  23 శాతం మహిళలు విడాకుల తర్వాత అప్పటికి వారు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. 
»  30 శాతం మంది మహిళలు విడాకుల తర్వాత ఉద్యోగాలను వదిలేస్తున్నారు.   

ఆరోగ్య బీమా తరహాలో ఆర్థిక ప్రణాళికలు!
విడాకుల తర్వాత తాము నిర్మించుకున్న ఆర్థిక ప్రపంచం ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందని, చివరకు అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు పురుషులు పేర్కొనడం గమనార్హం. ఆరోగ్య బీమా తరహాలో ‘అనుకోని పరిస్థితుల్లో విడాకుల వరకూ వెళ్లాల్సి వస్తే’ అని ఆలోచిస్తూ దానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)