Breaking News

టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి!

Published on Tue, 08/19/2025 - 04:51

నరసరావుపేట రూరల్‌: టీడీపీ నేతల ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ పార్టీ మహిళా నేత­లు సైతం భూ ఆక్రమణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పల్నా­డు జిల్లాలో సోమవారం ఓ వృద్ధురాలు ఫిర్యా­దు­తో వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాలివీ.. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పల్నా­డు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన వృద్ధురా­లు బత్తుల రోశమ్మ (70) ఎస్పీ కె. శ్రీనివాసరావుకు సో­మ­వారం ఫిర్యాదు చేసింది.

తనకు రాష్ట్ర ప్రభు­త్వం 2006­లో నిరుపేదల కోటా కింద 1.50 ఎకరాల పట్టా భూమిని ఇచ్చిందని.. ఈ భూమి పక్కనే టీడీపీ మహిళ నాయకురాలు చల్లా అనువకళ భూమి కూడా ఉందని ఆమె చెప్పింది. అయితే, తన భర్త అనారోగ్యంతో చనిపోవడం.. ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడం.. కుమా­రుడికి మతిస్థిమితం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని తన భూమిని ఆక్రమించుకునేందుకు ఓ పత్రి­కా విలేకరి సాయంతో అనువకళ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేధించడం ప్రారంభించిందని.. భూమిలోకి వస్తే చంపుతామని కూడా బెదిరించిందని ఆమె తన ఫిర్యా­దులో పేర్కొంది.

అంతేగాక.. జూలై 30న అనువకళ, మరికొందరు కలిసి తనపై దాడిచేశారని.. కాలు విరి­గి తీవ్రంగా గాయపడడంతో తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రోశమ్మ వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ పదిరోజులుగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కుమార్తె రమాదేవి, మనవడు సాయిరాం సాయంతో రోశమ్మ సోమవారం అంబులెన్స్‌లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. అనువకళతో పాటు ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తనను కాపాడాలని ఎస్పీని కోరింది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు కూడా అర్జీని అందజేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)