Breaking News

ఎస్‌ఎస్‌సీ బోర్డు ‘ఫెయిల్‌’

Published on Wed, 05/28/2025 - 02:42

జమ్మలమడుగు : ఫలితాల వెల్లడిలో ఎస్‌ఎస్‌సీ బోర్డు ఫెయిలైంది. బోర్డు అధికారుల తప్పిదం వల్ల ఓ విద్యార్థిని నష్టపోయింది. ఆమె భవిత అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్‌లో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్‌లో ఫెయిల్‌ అయినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ఆమె తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిషులో 84, గణితంలో 93, సైన్స్‌లో 98 మార్కులు సాధించింది. 

సోషల్‌లో మాత్రం 21 మార్కులే వచ్చినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు మార్కుల లిస్టు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి వెయ్యి రూపాయలు కట్టి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు. అధికారులు జవాబుపత్రం రీవాల్యూయేషన్‌ చేసి 84 మార్కులు సాధించినట్టు ఫలితంతోపాటు జవా­బు­పత్రం పంపారు. అంటే ఆమెకు ఏకంగా 63 మా­ర్కులు పెరిగాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగి­పోయింది. 

ట్రిపుల్‌ ఐటీ, ఏపీ మోడల్‌ స్కూల్స్, రెసిడెన్షియల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ కోసం దరఖాస్తు గడు­వు ముగిసిపోయింది. మొత్తం ఆరు సబ్జెక్టుల్లో దీక్షితకు 537 మార్కులు వచ్చాయి. అంటే ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. వాల్యూయేషన్‌ అధి­కారుల తప్పిదం వల్ల ఆ అవకాశం తప్పిపోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత తీవ్రంగా కలత చెందుతోంది. 

ప్రొద్దుటూరు ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం తండ్రితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యా­యం చేయాలని కోరింది. వాల్యూయేషన్‌ చేసిన అధి­కా­రులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవా­లని డి­మాండ్‌ చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తన­కు ఏపీ రెసిడెన్షియల్, గురుకుల, ట్రిపుల్‌ ఐటీల­కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)