చిరుత కోసం గాలింపు

Published on Mon, 08/14/2023 - 03:07

సాక్షి, తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితను ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసిన చిరుతను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ, టీటీడీ, పోలీస్‌ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడు­తున్నారు. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు, 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వాహనం శబ్దం వినడంతో చిరుత అడవిలోకి పారిపోయినట్టు తెలిసింది. చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. 

పండ్లు.. కూరగాయల కోసమే!
కాలినడక మార్గంలో వ్యాపారులు పండ్లు, కూరగా­యలు విక్రయిస్తున్నారు. కొందరు భక్తులు నడిచి వెళ్తున్నప్పుడు తినడానికి పండ్లు వెంట తెచ్చుకుంటున్నారు. ఆ పండ్లు, కూరగాయలను కొందరు భక్తులు నడక మార్గంలో కనిపించే దుప్పి, జింకలకు తినిపిస్తుంటారు. భక్తులు ఇచ్చే వాటి కోసం అవి కాలినడక మార్గానికి చేరుకుంటున్నాయి. దీంతో దుప్పి, జింకల కోసం చిరుతలు ఆ ప్రాంతానికి వస్తు­న్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు.

అక్క­డికి వచ్చే చిరుతలు దుప్పి, జింకలు దొరకని సమ­యంలో చిన్నారులపై దాడికి పాల్పడుతున్నా­యంటున్నారు. కాగా, చిన్నారి లక్షిత బంతితో ఆడుకుంటుండగా.. గాలి వాటానికి ఆ బంతి దూరంగా పడ­టంతో దానిని తీసుకునేందుకు మెట్లు దాటి అడవి­లోకి వెళ్లిందని అధికారులు చెబుతు­న్నారు. ఈ నేపథ్యంలోనే చిరుత అమాంతం లక్షిత గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి ఉంటుందని అనుమా­నం వ్యక్తం చేస్తున్నారు.

ఆపదను తప్పించే ‘ఆలోచన’
తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ భక్తుడు ఆదివారం అందరినీ ఆకట్టుకున్నాడు. నడక మార్గంలో వన్య ప్రాణులు సంచరిస్తోన్న నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ భక్తుడు తన కుమారుడి చేతికి రబ్బర్‌ ఎలా­స్టిక్‌ తాడు తగిలించి..ఆ తాడును ఆయన చేతికి ఇలా కట్టుకు­న్నాడు. దీనిపై ఆ భక్తుడిని ప్రశ్నించగా తమ జాగ్రత్త కోసమే తాడు కట్టినట్లు చెప్పాడు.    –  తిరుమల

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ రావాలి
ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చాకే లక్షిత మరణంపై కార­ణాలు తెలుస్తాయి. చిరుత కోసం గాలి­స్తు­న్నాం. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలి­­నడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపు­లుగా వెళ్లడం మంచిది. పండ్లు, కాయ­గూరలు ఎక్క­డంటే అక్కడ పడేయకుండా ఉంటే బాగుంటుంది.     – సతీష్‌రెడ్డి, డీఎఫ్‌ఓ, తిరుపతి

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)