Breaking News

సంస్కృత భాషాభివృద్ధికి ఎన్‌ఎస్‌యూ కృషి అభినందనీయం

Published on Fri, 02/23/2024 - 04:55

తిరుపతి సిటీ/ఏర్పేడు: సంస్కృత భాషాభివృద్ధికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్‌ఎస్‌యూ) ఎనలేని కృషి చేస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కొనియాడారు. గురువారం తిరు­ప­తి ఎన్‌ఎస్‌యూలో ఉత్కల పీఠం (ఒడిశా చైర్‌) ఏర్పా­టు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన వర్చువల్‌ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

శ్రీవారి పాదాల చెంత వెలసిన సంస్కృత వర్సిటీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచా­రం చేసి పరిరక్షించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వర్చువల్‌ విధానంలో వర్సిటీలో నూతన హాస్టల్‌ భవనాలను, తరగతి గదులను ప్రారంభించారు. ఉత్కల పీఠం రజతోత్సవ పైలాన్, శిలాఫలకాన్ని ఇస్కా­న్‌ టెం­పుల్‌ అధ్యక్షులు రేవతి రమణదాన ప్రభు ప్రారంభించారు.  

ఇన్నోవేషన్‌ హబ్‌గా తిరుపతి ఐఐటీ 
తిరుపతి కేంద్రంగా ఏర్పేడులో స్థాపించిన ఐఐటీ విద్యాసంస్థ అనతి కాలంలోనే ఇన్నోవేషన్‌ హబ్‌గా పేరుగాంచడం గర్వంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. గురువారం తిరుపతి ఐఐటీలో జరిగిన నాల్గొవ, ఐదవ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం శుభపరిణామమన్నారు. మొత్తం 355మంది బీటెక్, 106 మంది ఎంటెక్, ఇద్దరు డ్యూయల్‌ డిగ్రీ, 74మంది ఎమ్మెస్సీ, 17మంది ఎంఎస్, 21మంది పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)