Breaking News

విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఎన్‌ఎస్‌జీ–1 హోదా

Published on Fri, 09/13/2024 - 05:17

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్‌ భారతీయ రైల్వేలోనే ఎంతో ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్‌జీ–1 (నాన్‌ సబర్బన్‌ గ్రూప్‌) హోదా సాధించి దేశంలోనే టాప్‌ 28 స్టేషన్లలో ఒకటిగానూ, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్‌ తరువాత రెండో స్టేషన్‌గా అరుదైన ఘనత సాధించింది. రైల్వేబోర్డు 2017–18 సంవత్సరం నుంచి ప్రతి ఐదేళ్లకోసారి స్టేషన్ల కేటగిరీ ఎంపిక విధానం ప్రవేశపెట్టింది. 

ఈ విధానంలో రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్లకు ఎన్‌ఎస్‌జీ–1 హోదా వస్తుంది. అప్పట్లో విజయవాడ స్టేషన్‌ రెండు ప్రమాణాలలో తక్కువగా ఉండటంతో ఎస్‌ఎస్‌జీ–2 హోదాతో సరిపెట్టుకుంది. 

ఐదేళ్ల తరువాత 2023–24లో రైల్వేబోర్డు తాజా సమీక్షలో విజయవాడ స్టేషన్‌ అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం, 16.84 మిలియన్ల ప్రయాణికులను కలిగి ఉండడంతో రైల్వేశాఖ ఎన్‌ఎస్‌జీ–1 హోదా ప్రకటించింది.  డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్‌జీ–1 హోదా రావటం  గర్వకారణమన్నారు. 

వ్యాపార, వాణిజ్య పరంగా డివిజన్‌ ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.  ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)