Breaking News

వానలుండవ్‌! అప్పటివరకు ఉష్ణతాపమే..

Published on Thu, 08/10/2023 - 04:55

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానల కోసం కొన్నాళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మారిన వాతావరణం నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. కొద్దిరోజుల నుంచి రాష్ట్రంపైకి పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ కూడా తక్కువగా ఉంటోంది. అలాగే బంగాళాఖాతంలో గాని, భూ ఉపరితలంలో గాని ఆవర్తనాలు/ద్రోణులు ఏర్పడటం లేదు. వర్షాలు కురవడం లేదు.

అంతేకాదు.. మేఘాల జాడ కనిపించడం లేదు. వీటన్నిటి ఫలితంగా గాలిలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతోంది. దీనికి పశ్చిమ­/­వాయవ్య గాలులు తోడై ఉష్ణతాపానికి, అసౌకర్య వాతావరణానికి కారణమవుతోంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా­యి. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకు వెళ్తున్నాయి. బుధవారం పల్నాడు జిల్లా శావల్యాపురంలో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.

కావలిలో 39.1, బాపట్లలో 39, ఒంగోలులో 38.9, విశాఖపట్నంలో 38 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని, వర్షాలకు ఆస్కారం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా కురిసినా తేలికపాటి వర్షం లేదా చిరు జల్లులకే పరిమితమవుతుందని పేర్కొంటున్నారు.  
అల్పపీడనాలు ఇప్పట్లో లేనట్టే.. 
సాధారణంగా ఆగస్టు ఆరంభం నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ప్రభావం చూపుతుంటాయి. వాటికి ద్రోణులు, ఆవర్తనాలు తోడై ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ.. ఇప్పటివరకు వాటి జాడ లేదు. దీంతో వానలు ముఖం చాటేశాయి. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ముందస్తు అంచనాల్లో స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే పరిస్థితులు కొనసాగుతున్నాయి.   

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)