Breaking News

AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం

Published on Tue, 05/20/2025 - 17:52

విజయవాడ:  చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్‌ డోర్‌ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్‌ను డోర్‌ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.   ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో రేషన్‌ డోర్‌ డెలివరీని నిలిపివేయడం ఒకటి. 

ఫలితంగా ఎండీయూ ఆనరేటర్లను రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో 9260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిచిపోనున్నాయి.  మళ్లీ పాత పద్ధతిలోనే రేషన్‌ షాపుల నుండి సరఫరా చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. 

మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే..
రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసే అంశాన్ని ఎండీయూ ఆపరేటర్లు గతంలో వ్యతిరేకించినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎండీయూ ఆపరేటర్లపై జాలి లేకుండా వ్యవహరించడమే కాకుండా మళ్లీ ప్రజలు పాత పద్ధతిలో షాపుల వద్ద క్యూ లో ఉండి తీసుకునే విధానానికే ప్రభుత్వం మళ్లీ మొగ్గుచూపింది. 

గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో రేషన్‌ను ఇప్పటివరకూ డోర్‌ డెలివరీ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే  పొందుతుండగా మళ్లీ వెనకటి రోజుల గుర్తు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు.  దాంతో ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పదనే సంకేతాన్ని, సందేశాన్ని కేబినెట్ సాక్షిగా ఇచ్చేశారు చంద్రబాబు. ఇప్పటికే 2.50 లక్షల వాలంటీర్లను తీసేసిన ప్రభుత్వం.. తాజాగా ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ వాహనాలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)