Breaking News

వాళ్లు మనోళ్లే.. చూసుకోండి..!

Published on Thu, 09/25/2025 - 05:33

సాక్షిప్రతినిధి నెల్లూరు: ఇసుక టిప్పర్‌ రాంగ్‌ రూట్‌లో కారును ఢీకొనడంతో ఏడుగురు దళితులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగి వారమైనా కనీసం డ్రైవర్‌ను కూడా అరెస్ట్‌ చేయలేక పోయారంటే ఏ మేరకు ఒత్తిడి ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని అదే రోజు రాత్రి ఎస్పీ డాక్టర్‌ అజిత ప్రకటించారు. సరిగ్గా అప్పటి నుంచే అసలు నాటకం మొదలైంది. 

ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ యజమాని ఏఎస్‌పేట మండలం చిరమనకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, ఇసుక అక్రమ రవాణాదారుడు బుజ్జయ్యనాయుడులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ముఖ్య అనుచరులు. దీంతో వారిని రక్షించేందుకు మంత్రే స్వయంగా రంగంలోకి దిగి పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచి్చనట్లు తెలుస్తోంది. తాను చెప్పినట్లే కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు లైసెన్స్‌ లేదు.. పైగా తప్పతాగాడు.. దీంతో కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇన్సూ్యరెన్స్‌ కూడా రాదని అతన్ని తప్పించేలా వ్యూహం పన్నారు. 

ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్‌ను అరెస్ట్‌ చూపలేదు. అతన్ని వదిలేసి.. తెల్లారేసరికే డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రమాద ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో వివరాలను సైతం తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ–1గా టిప్పర్‌ డ్రైవర్‌ను చూపించారు. ఇసుక టిప్పర్‌ నంబర్‌కు బదులుగా ప్రమాదానికి గురైన కారు నంబర్‌ను నమోదు చేశారు. ఏ–2గా టిప్పర్‌ యజమాని అని రాసి అక్కడ సైతం టిప్పర్‌ నంబర్‌కు బదులుగా బాధితుల కారు నంబర్‌ను నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ నంబర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా చూపలేదు. ఈ విషయం బాధితులు నిలదీయడంతో తప్పులు సరిదిద్దారని తెలిసింది.      

డ్రైవర్‌ మార్పులో హైడ్రామా 
ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వదిలేసి తొలుత ఏఎస్‌పేట మండలం కావలియడవల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డిని డ్రైవర్‌గా చూపించేందుకు నాలుగు రోజులుగా యత్నించారు. అయితే ఈ విషయమై అతని భార్య, పిల్లలు తీవ్రంగా అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. ప్రతాప్‌రెడ్డిని కేసులో ఇరికిస్తే వాస్తవ విషయాలను మీడియా ముందు వెల్లడిస్తామని వారు హెచ్చరించడంతో మంగళవారం రాత్రి హడావుడిగా మదరాబాద్‌కు చెందిన సు«దీర్‌ అనే వ్యక్తిని డ్రైవర్‌గా చూపించి అరెస్ట్‌ చేశారు. 

టిప్పర్‌ యజమాని, ఇసుక అక్రమ రవాణాదారుపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవు. అయితే చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో అనధికార ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న విషయం మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖలకు తెలిసినా మౌనంగా ఉన్నారు. 

అసలు ఇక్కడ ఇసుక రీచ్‌కు అనుమతి ఎవరిచ్చారు? రీచ్‌లోకి వెళ్లడానికి గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి అనుమతులిచ్చిన అధికారులు ఎవరు? వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు కనీస విచారణ కూడా చేయలేదు. ఈ ఘటనకు పూర్తిగా మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులే బాధ్యులని స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమాలకు పచ్చ జెండా ఊపి..మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)