Breaking News

ప్రసాద్‌ కుటుంబానికి 5 లక్షల సాయం

Published on Fri, 12/04/2020 - 08:34

సాక్షి, చిత్తూరు (రేణిగుంట) : నివర్‌ తుపాన్‌ సమయంలో రాళ్లకాలువ వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ప్రసాద్‌ కుటుంబానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి కుమ్మరిపల్లె దళితవాడకు చేరుకుని బాధిత కుటుంబానికి నగదు అందజేసి వారిని ఓదార్చారు. అలాగే ప్రభుత్వం తరపున మరో రూ.5లక్షల పరిహారాన్ని  మృతుడి భార్య నాగభూషణకు అందించారు. 

ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మృతుడి పిల్లలు ధీరజ్, హమీష్‌లను తామే చదివిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నాగభూషణకు ఫించను మంజూరు పత్రం అందించారు. గ్రామ వలంటీర్‌ ఉద్యోగాన్ని సైతం ఇప్పిస్తామని ప్రకటించారు. అనంతరం అదే వాగులో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వెంకటేష్, లోకేష్‌లను కూడా పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హరిప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ హరిప్రసాద్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, జువ్వల దయాకర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, మునిరెడ్డి, శేషారెడ్డి, బాబ్జీ, హరి పాల్గొన్నారు.  చదవండి:  (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..)

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)