Breaking News

స్క్రబ్‌ టైఫస్‌తో 9 మంది మృతి

Published on Tue, 12/09/2025 - 02:39

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు ఈ ఏడాది 1,566 నమోదయ్యాయని.. ఇందులో తొమ్మిది మంది బాధితులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ వెల్లడించారు. అయితే, ఈ మరణాలన్నీ స్క్రబ్‌ టైఫస్‌వల్లే జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేద­న్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రబ్‌ టైఫస్‌ బాధితులు ఎందువల్ల మరణించారనే దానిపై పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఇందుకు కనీసం రెండు నెలల నుంచి మూడునెలల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.

బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్‌ స్వీకెన్సీ (గుంటూరు, తిరుపతి) ద్వారా పరీక్ష చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. బోధనాసుపత్రుల్లో ఉండే ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం (ఆర్‌ఆర్‌)లు అధిక కేసులు/అసాధారణ మరణాలు నమోదైన ప్రాంతాల్లో పరిశోధన చేస్తాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆర్‌ఆర్‌ టీంలు ఉన్నాయన్నారు. ఎలీశా పరీక్ష చేయించి, స్క్రబ్‌ టైఫస్‌పై అవగాహనకు వస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో గడిచిన 38 రోజుల్లో 26 స్క్రబ్‌ టైఫస్‌ కేసులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రఘునందన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మన్యంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ గిరిజనుడికి స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి తెలిపారు. చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన మడివి లక్ష్మయ్య ఈనెల 4న అధికజ్వరం, ఒళ్లునొప్పు­లతో సీహెచ్‌సీకి రాగా, వైద్యులు అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనికి స్క్రబ్‌ టైఫస్‌ బ్యాక్టీరియా పాజిటివ్‌గా తేలింది. లక్ష్మయ్యకు చికిత్సకు అందిస్తున్నా­మని అతని పరిస్థితి స్థిరంగా ఉందని కోటిరెడ్డి తెలిపారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్లు, మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)