Breaking News

పెళ్లయిన రోజే ప్రాణాలు తీసుకుంది

Published on Wed, 01/22/2025 - 09:53

సత్యవేడు: పెళ్లయిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకంలో కలకలం రేపింది.  పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ధనంజయ, రతి దంపతుల కుమార్తె ఆర్తీ(20) అక్కడే ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం ఫైనలియర్‌ చదువుతోంది.

 సత్యవేడు మండలం ఆంబాకానికి చెందిన సమీప బంధువు సూర్య వారితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్యకు, ఆర్తీకి వివాహం జరిపించారు. ఆ తర్వాత తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సత్యవేడు మండలంలోని ఆంబాకానికి వచ్చారు. రాత్రి దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లిన ఆర్తీ ఎంతకీ రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది.

 వెంటనే సత్యవేడు వైద్యశాలకు ఆమెను తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్‌ఐ రామస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)