Breaking News

వర్క్‌ ఫ్రం హోంపై కొత్త పాలసీ

Published on Tue, 03/11/2025 - 04:46

సాక్షి, అమరావతి: వర్క్‌ ఫ్రం హోంపై సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్హతలు ఉండి, పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని అధికా­రులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సోమవారం సీఎం సమీక్ష చేశారు. వివిధ కార్యక్రమాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సమీక్షించారు.

ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100 శాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తంకావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలుచేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టిపెట్టాలని సూచించారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని ఆదేశించారు. కింది­స్థాయి ఉద్యోగులు, అధికారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారులు సేవలు మెరుగుపరచాలని సూచించారు. 

ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించొద్దన్నారు.   ‘ఆస్పత్రుల్లో అందించే సేవలపై రోగుల నుంచి ప్రభుత్వం అభిప్రాయం సేకరించగా.. 68.6శాతం మంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. డాక్టర్ల ప్రవర్తనపై 71.7 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 65.6 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు. మందులు ఆస్పత్రుల్లో ఇస్తున్నారా, ప్రభుత్వాస్పత్రిలో పరిశు­భ్రత ఎలా ఉందన్న ప్రశ్నలకు 65 శాతం సంతృప్తి వ్యక్తంకాగా.. దీన్ని మరింత మెరుగుపరుచు­కోవాలి’ అని సీఎం సూచించారు. 

‘ఎప్పటికప్పుడు చెత్త సేకరి­స్తున్నారా... అన్న ప్రశ్నకు 67 శాతం మంది అవునన్నారు. రెవెన్యూ సేవలకు సంబంధించి పాసు పుస్తకానికి అదనపు చార్జీలు తీసుకుంటున్నారని.. సర్వే దరఖాస్తుపై దరఖాస్తు రుసుము కాకుండా అదనపు చార్జీలు తీసుకుంటున్నారని ప్రజలు బదు­లిచ్చారు. రెవెన్యూ సేవల్లో మార్పు కనిపించాలి’ అని సీఎం చెప్పారు. కాగా, ‘పాపులేషన్‌ డైనమిక్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’పై మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగే సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

అమరావతికి డీప్‌ టెక్నాలజీ
ప్రభుత్వ క్యాన్సర్‌ సలహాదారునిగా డాక్టర్‌ నోరి
డీప్‌ టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అమ­రావతికి తేవడానికి కృషిచేస్తానని సీఎం చంద్ర­బాబునాయుడు అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రముఖ క్యాన్సర్‌ వైద్యులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు జీవిత ప్రయాణానికి సంబంధించిన ‘మంటాడ టూ మ్యాన్‌హ్యాటన్‌’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సంద­ర్భంగా మాట్లాడుతూ.. నోరి దత్తాత్రేయుడు పేద కుటుంబంలో పుట్టి, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి వైద్యులుగా ఎదిగారని కొనియాడారు. 

50 ఏళ్ల పాటు క్యాన్సర్‌ వైద్యసేవల్లో నిమగ్నమయ్యార­న్నారు. నోరి ఫౌండేషన్‌ పెట్టి ప్రజాసేవ చేస్తు­న్నారన్నారు. ‘నోరి’ని ఏపీ ప్రభుత్వ క్యాన్సర్‌ సలహదారుగా నియమిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బసవతారకం తర­హా­లోనే అమరావతిలోనూ ఓ క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మించడానికి చర్యలు తీసుకుంటు­న్నామని చంద్రబాబు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి సాగును 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కూడా మాట్లాడారు.  

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)