Breaking News

‘గడప గడపకు..’ ఆ బాలికకు మలుపు!

Published on Sun, 04/13/2025 - 03:09

ఆస్పరి:  ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎంతో మందికి ఆశాజ్యోతి వెలిగించిందనడానికి చక్కటి ఉదాహరణ.. నిర్మల.  చదువు మానేసిన ఈ బాలిక జీవితాన్ని, జగన్‌ ప్రభుత్వం చేపట్టిన  ప్రతిష్టాత్మక కార్యక్రమం మలుపు తిప్పింది. ఇంటర్మీడియట్‌ బైపీసీలో 1000కి 966 మార్కులతో ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఆ బాలిక గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది.  ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా సామాన్యుల జీవితాల్లో వచ్చే మార్పుకు ఇది గొప్ప ఉదాహరణ. 

ఐపీఎస్‌ కావడమే తన లక్ష్యమని చెబుతున్న ఈ బాలిక వివరాల్లోకి వెళితే, ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన శీనప్ప, హనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. చిన్న కుమార్తె నిర్మల 2021–22లో పెద్దహరివాణం జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్లో 10వ తరగతిలో 537 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రులు అంతటితో చదువు మాన్పించారు.

‘గడప గడపకు మన ప్రభుత్వం’.. ప్రోత్సాహం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సరిగ్గా రెండేళ్ల క్రితం అప్పటి ఆదోని ఎమ్మెల్యే వై.­సాయి ప్రసాద్‌ రెడ్డి పెద్దహరివాణంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటుండగా, విద్యార్థిని విషయం తెలిసి చలించిపోయారు. ‘నాకు బాగా చదువుకోవాలని ఉంది’ అని బాలిక నిర్మల చెప్పడంతో అప్పటికప్పుడు ఈ విషయాన్ని  అప్పటి జిల్లా కలెక్టర్‌ జి.సృజన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ కూడా నిర్మలను భుజంతట్టి ప్రోత్సహించారు.  

ఆస్పరి కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్‌  బైపీసీలో చేర్పించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలిక 440కి 420 మార్కులు సాధించింది. తాజాగా విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1000కి 966 మార్కులు సాధించి, జిల్లాలో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. జిల్లాలో 26 కస్తూర్బా పాఠశాలలు ఉండగా..  బైపీసీ గ్రూపు ఆస్పరిసహా ఎనిమిది పాఠశాలల్లో  ఉంది. చక్కటి ఫలితాలతో నిర్మల, బాలికలకు ఆదర్శంగా నిలిచినట్లు ఆస్పరి కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్‌ శారూన్‌ స్మైలీ పేర్కొన్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)