Breaking News

శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలు! 

Published on Sun, 07/30/2023 - 04:36

తిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుం­డీలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు స­మా­చారం. అందులో భాగంగా శని­వారం శ్రీవారి ఆలయంలోకి స్టీల్‌తో తయారు చేసిన ఐదు అడుగుల హుండీని ప్రయోగాత్మకంగా తీసుకెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలను ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలను, మరికొన్ని ఇత్తడి హుండీలను ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు.

వీటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ద్వా­రా ట్రాలీల్లో శ్రీవారి ఆలయం నుంచి బయ­టకు, అక్కడి నుంచి లిప్టు ద్వారా లారీలో ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి నూతన పరకామణికి తరలిస్తున్నారు. అయితే ఇటీవల హుండీ తరలింపు సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నూతన హుండీలను తయారు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొంత మంది ఆలయంలోకి ప్రవేశించి హుండీలో భక్తులు నగదు వేస్తున్న సమయంలో హుండీ లోపలకు చేయిపెట్టి చోరీ చేసిన సంఘటనలు తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ రెండు ఇబ్బందులు రాకుండా నూతన హుండీలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నూతన హుండీలో మూడు వైపులా భక్తులు నగదు వేయవచ్చు. అదే సమయంలో ఇందులో భక్తుడి చేయి పూర్తిగా దూరే అవకాశం లేదు. మధ్యలో ఓ ఇనుప చువ్వను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నూతన హుండీ పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. వినియోగం సులభంగా ఉంటే దీనినే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

నేడు శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం 
తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు.

#

Tags : 1

Videos

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)