Breaking News

సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి

Published on Sun, 10/05/2025 - 05:08

అనంతపురం సెంట్రల్‌: అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో దయ­నీయ పరిస్థితి చోటు చేసుకుంది. సక్రమంగా పాలు పట్టకపోవడంతో తీవ్ర అనారోగ్యంపాలైన ఓ నవ­జాత శిశువు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శిశుగృహ, ఐసీడీఎస్‌ సిబ్బంది శిశువును ఖననం చేయడం పలు అను­మానా­లకు తావిస్తోంది. ఐసీడీఎస్‌ అధికారుల కథ­నం మేరకు.. 20 రోజుల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చి, ధర్మవరం వెళ్లే రోడ్డులోని ముళ్లపొదల్లో వదిలేసింది.

స్థాని­కులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వ­డంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు అప్పగించారు. 2 రోజుల పాటు పాలు సక్రమంగా అందించకపో­వ­డంతో దసరా రోజు అనారోగ్యం పాలైనట్లు సమా­చా­రం. గురువా­రం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో శిశువును చూసుకునే ఆయా స్థానిక ప్రభు­త్వాసు­పత్రికి తీసు­కెళ్లింది. అప్పటికే పసిబిడ్డ మృతి చెందిన­ట్లు వైద్యు­లు ధ్రువీకరించారు. ఈ ఘటన గురించి ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులకు, చైల్‌ 
వెల్ఫేర్‌ కమిటీ సభ్యులకు తెలియజేయకుండానే కాంట్రాక్టు సిబ్బందే ఖననం చేసేశారు.

చిన్నారి అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, అదే రోజు ఖననం చేశా­రని అనంతపురం ఐసీడీఎస్‌ ప్రా­జె­క్టు డైరెక్టర్‌ నాగమణి తెలిపారు. ఈ విషయం అధి­కారులకు తెలి­యడంతో.. నీ వల్లే అంటూ ఇద్దరు మహి­ళా సిబ్బంది ఒకర్నొ­కరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.

నిర్లక్ష్యంతోనే పసివాడి ఆకలిచావు
కాగా, శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అనాథలు, పోషణ భారంగా మారిన వారి చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఐసీ­డీఎస్‌ ఆధ్వర్యంలో శిశుగృహను నిర్వహిస్తోంది. ఇక్కడ గ్రూపు తగాదాల కారణంగా కొంత­కాలంగా సిబ్బంది సక్రమంగా పనిచే­యడం లేదు. శుక్ర­వారం ఇద్దరు ఆయాలు పనిచేయగా.. రాత్రి రావా­ల్సిన ఇద్దరు ఆయాల్లో ఒకరు సెలవు పెట్టారు.  దీంతో పాల కోసం చాలాసేపు ఏడ్చిన శిశువు చివరకు అర్ధరాత్రి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న ఆయా ఆ చిన్నారిని తీసు­కొని ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆమె ఆస్పత్రికి వెళ్లేలోగానే దారిమధ్యలోనే ఈ చిన్నారి ప్రాణాలు వదిలింది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)