Breaking News

పిల్లలపైనా మైగ్రేన్‌ దాడి

Published on Mon, 10/21/2024 - 05:04

సాక్షి, విశాఖపట్నం: పిల్లల్లోనూ పార్శ్వపు (మైగ్రేన్‌ హెడేక్‌) తలనొప్పి విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ న్యూరో నిపు­ణు­రా­లు డాక్టర్‌ డెబోరా ఫ్రెడిమాన్‌ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియన్‌ అకాడెమీ ఆఫ్‌ న్యూరాలజీ (ఐయాన్‌కాన్‌)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మైగ్రేన్‌కు సంబంధించిన పరిశోధనలు, చికిత్సలపై ఆదివారం మా­ట్లాడారు. ఆమె ఏం చెప్పారంటే...

ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి..
15 నుంచి 40 ఏళ్లలోపు వారిలో మైగ్రేన్‌  సమస్య ఎక్కువ­గా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సమస్యలతో వచ్చే వంద మందిలో 40 మంది మైగ్రేన్‌ అని చెబు­తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహి­ళ­లే ఉంటున్నారు. ప్రతి ఐదుగురు మహిళ­ల్లో ఒకరు, ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి మైగ్రే­న్‌ ఉంది. గడచిన పదేళ్లలో మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య దాదాపు 80 శాతం పెరిగింది. ఇది కలవర­పాటుకు గురిచేసే అంశం.

‘ఆరా’ రావడం వల్లే..
ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. వీరిలో 4 శాతం మందికి తలనొప్పి వచ్చే ముందు ‘ఆరా’ అనే అనుభవం ఉంటోంది. కళ్లముందు మెరుపులు వచ్చి­నట్టు.. చుట్టూ బైర్లు కమ్మినట్లు, శరీరమంతా మొద్దుబారిన భావన­కు గురవుతున్నారు. దీన్నే ఆరా అని పిలు­స్తున్నాం. ఈ ఆరా ద్వా­రానే మైగ్రేన్‌కు మంచి చికిత్సల్ని తీసుకు­రా­గలు­గు­తున్నాం. దాదాపు 20 ఏళ్లుగా మైగ్రేన్‌పై పరిశోధనలు చేస్తు­న్నాను. మెదడులో ఉండే సెరిబ్రో స్పైనల్‌ ఫ్లూయిడ్‌ (సీఎస్‌ఎఫ్‌) అనే ద్రవం అలల మాదిరిగా కదులుతూ మెదడులోని మలి­నాల్ని శుభ్రం చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ సీఎస్‌ఎఫ్‌­లోకి సమస్యాత్మక ప్రోటీన్స్‌ వచ్చినప్పుడు ఆరా మొదలై.. మైగ్రేన్‌ అనుభవం ఏర్పడుతుంది. ఈ ఆరాకు కారణమవుతున్న ప్రోటీన్లను అడ్డుకునేలా మందులు కనిపెట్టాం. ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం.

ఒత్తిడికి దూరంగా ఉండాలి
మైగ్రేన్‌ లక్షణాలు అందరిలోనూ ఒకేలా కనిపించడం లేదు. 25 శాతం మంది మాత్రమే మైగ్రేన్‌ని ముందస్తుగా గుర్తించగలు­గుతున్నారు. మైగ్రేన్‌ వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే.. దానికి తగినట్లుగా మందులు వాడుతుంటే.. క్రమంగా నివారించగలం. మైగ్రేన్‌కు సరైన చికిత్స లేదు. కానీ.. ఇటీవల కాలంలో సీజీఆర్‌పీ వంటి కొత్త చికిత్సలతో పాటు లాస్మిడిటన్, ట్రిప్టాన్స్‌ వంటి మందులు అందుబాటులోకి రావడంతో మైగ్రేన్‌ అటాక్స్‌ని తగ్గించగలుగుతున్నాం. అయితే.. జీవనశైలిలో మార్పులు రావాలి. సమయానికి నిద్ర,మంచి ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారానే మైగ్రేన్‌ని నియంత్రించగలం.

చిన్నారులూ బాధితులే
మరో బాధాకరమైన విషయ­మేమిటంటే.. మైగ్రేన్‌కు చిన్నారులూ బాధితులుగా మారుతున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో 20 మంది దీనిబారిన పడుతున్నా­రు. బాలికలతో పోలిస్తే బాలురులో ఎక్కువగా ఇది కని­పిస్తోంది. తమకు తలనొప్పి వస్తుందని తల్లి­దండ్రులకు చెప్పినా.. వాళ్లు నమ్మడం లేదు. స్కూల్‌ ఎగ్గొట్టేందుకు చెబుతున్న కుంటిసా­కులుగానే తీసుకుంటున్నారు. ఇదే ప్రమా­ద­కరంగా మారుతోంది. తేలిగ్గా తీసు­కుంటే మైగ్రేన్‌ ముప్పుగా మారుతుందన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. యుక్తవయసులో మాత్రం ఇది అమ్మాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)