Breaking News

డైరెక్టర్‌ బోయపాటికి నెటిజన్ల చురకలు

Published on Sun, 10/08/2023 - 15:19

స్కిల్‌ స్కామ్‌ కేసులో ఇరుక్కుని రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు సంఘీభావం అంటూ టీడీపీ ఏవో కార్యక్రమాలు చేపడుతున్నా అవి అట్టర్‌ఫ్లాప్‌ అవుతూనే ఉన్నాయి..  మొన్న కంచాలు,గరిటెలు మోగించాలని పిలుపు ఇచ్చినా దాన్ని జనం పట్టించుకోలేదు. నిన్న కాంతితో క్రాంతి అంటూ ఇంట్లో విద్యుత్‌ లైట్లు ఆర్పి క్యాండిల్స్‌ వెలిగించాలని టీడీపీ పెద్దలు సూచించారు. దానికి కూడా ప్రజాదరణ కరువైంది. ఏపీ వ్యాప్తంగా ఎవరూ కూడా టీడీపీ ఇచ్చిన ఈ పిలుపును సీరియస్‌గా తీసుకోలేదు.  దాంతో  ఇది కూడా ఫ్లాప్‌ అయ్యింది

కాగా, టాలీవుడ్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాత్రం క్యాండిల్స్‌ వెలిగించి ఏదో బిల్డప్‌ ఇచ్చే యత్నం చేశారు. కానీ అది విమర్శల పాలైంది.  గతంలో గోదావరి పుష్కరాలప్పుడు 29 మంది చనిపోతే, అది కూడా చంద్రబాబు డైరెక్షన్‌లో బోయపాటి చెప్పిన ‘యాక్షన్‌’ సీనుకు 29 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏదో ఘనకార్యం చేసినట్లు చూపిద్దామనుకున్న చంద్రబాబు చేసిన పనికి తొక్కిసలాట జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

 ఆ రోజు కనీసం వారికి సంతాపంగా కనీసం క్యాండిల్స్‌ కూడా వెలిగించని బోయపాటి.. ఈరోజు మాత్రం చంద్రబాబుకు సంఘీభావం అంటే  క్యాండిల్స్‌ వెలిగించడం నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది.  ‘ ఏం బోయపాటి.. ఆరోజు అమాయక ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా.. కనీసం అప్పుడు వారికి సానుభూతి కూడా చెప్పలేదు. ఇప్పుడు మాత్రం క్యాండిల్స్‌ చేతిలో పట్టుకుని ఫోజులిస్తున్నావ్‌’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.  ‘ఆనాడు ఇలా ఒక కొవ్వొత్తి కూడా పట్టుకోలేదే... ఈనాడు మీ కుల పెద్ద లోపల ఉండేసరికి కొవ్వొత్తులతో బాగానే రంజింప చేస్తున్నావ్’ అంటూ విమర్శిస్తున్నారు.

‘సాక్షి’ తెలుగు న్యూస్‌ కోసం వాట్సాప్‌ చానల్‌ను ఫాలో అవ్వండి

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)