Breaking News

విహంగాల విహారం

Published on Mon, 10/20/2025 - 05:25

దొరవారిసత్రం:  ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్‌(అక్టోబర్‌లో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్‌)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్‌ ఐబీస్‌) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు.  

పక్షుల కేంద్రంలో ఈపాటికే...  
వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్‌ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు.

ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి.   

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)