Breaking News

నీట్‌ ఫలితాలు.. కుటుంబం ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి!

Published on Sat, 08/01/2026 - 11:36

ఆంధ్రప్రదేశ్, కోడుమూరు రూరల్‌: నీట్‌ పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాల్‌కు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు.

బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్‌ కావాలనుకోవడంతో ఇంటర్‌ బైపీసీ ఇప్పించగా 965మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్‌ నీట్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ వల్ల క్యాన్సిల్‌ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్‌ ఫలితాల్లో తనకు 487మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాల్‌కు చెప్పసాగింది.

అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్‌ చేయగా నీట్‌ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకు బయటకు రాకపోవడం, పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చిన వేణుగోపల్‌ భార్య భాగ్యమ్మ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులను పగులగొట్టి చూడగా అప్పటికే పుష్పావతి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఉరి నుంచి తప్పించి చూడగా అప్పటికే మృతి చెందింది.

పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి నీట్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)