Breaking News

హార్సిలీహిల్స్‌ ఘాట్‌పై తప్పిన ప్రమాదం

Published on Mon, 05/20/2024 - 04:32

బి.కొత్తకోట: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ ఘాట్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఓ మినీబస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కాగా డ్రైవర్‌ సమయస్ఫూర్తి వల్ల 25 మంది పర్యాటకులకు ప్రాణాపాయం తప్పింది. రాయచోటి నియోజకవర్గం చిన్నమండేనికి చెందిన పర్యాటకులు స్థానికంగా ఉన్న ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సును అద్దెకు తీసుకుని హార్సిలీహిల్స్‌ పర్యటనకు వచ్చారు. 

సాయంత్రం తిరిగి వెళ్తుండగా ప్రొద్దుటూరు మలుపు వద్దకు రాగానే మినీబస్సు వేగం నియంత్రించేందుకు డ్రైవర్‌ ఖాదర్‌వలీ ప్రయత్నించగా బ్రేక్‌ ఫెయిలైంది. వాహనాన్ని అలాగే ముందుకు పోనిస్తే మలుపు వద్ద ప్రమాదం జరిగేది. కానీ అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును నేరుగా గ్రిల్‌ పక్కనే ఉన్న బండరాళ్లను ఢీకొట్టించి బస్సు ఆగేలా చేశారు.

 ఈ సంఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అందరూ ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలానికి వెళ్లారు. చాలా తక్కువ వేగంతో వస్తున్నందునే ప్రమాదాన్ని నివారించగలిగానని డ్రైవర్‌ ఖాదర్‌వలీ చెప్పారు. 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)