Breaking News

తీర ప్రాంత శోధన కోసం ఎన్‌సీసీఆర్‌ కేంద్రం

Published on Wed, 03/13/2024 - 04:51

పెదగంట్యాడ (విశాఖపట్నం): సము­ద్ర జలాల నాణ్యతను పర్య­వేక్షించడంతో పాటు ప్రిడిక్షన్‌ ఆఫ్‌ కోస్టల్‌ వాటర్‌ క్వాలిటీ (పీడబ్ల్యూ­క్యూ), ఎకో సిస్టం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్‌సీసీఆర్‌ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు అన్నారు. మంగళవారం యారాడలోని డాల్ఫిన్‌ నోస్‌పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ అనుబంధ సంస్థ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీసీఆర్‌) కేంద్రాన్ని ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా  ప్రారంభించారు.

5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6నెలల్లో  రీసెర్చ్‌కు అవస­రమైన పరికరాలను సిద్ధం చేస్తా­మ­న్నా­రు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఇటీవల కాలం­లో విపత్తులు ఎక్కువయ్యాయని, ఇటీ­వల సంభవించిన తుపాన్ల వల్ల ముం­బై, చెన్నై వంటి నగరాలు వణికి­పోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, తీరం వెంబడి ఉన్న సమస్యలను తెలు­సుకుని వాటిని పరి­ష్కరించే విధంగా పరిశోధనలు చేయా­లని మినిస్ట్రీస్‌ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.రవిచంద్రన్‌ కోరారు.  

ఇప్పటివరకూ ఎన్‌సీసీ­ఆర్‌ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్వి­రాన్‌మెంట్‌ విభాగంలో నిర్వ­హిస్తూ వస్తున్నామని, ఇకపై ఈ భవనంలోకి దానిని తరలించనున్నామని ఎన్‌సీసీఆర్‌ డైరెక్టర్‌ ఎంవీ రమణమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటరాలజీ (ఐఐటీఎం), ఎంవోఈఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.కృష్ణన్, ఎంవోఈఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్, సీపీడబ్ల్యూడీ చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, రీసెర్చ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?