Breaking News

అమరావతిలో పేదల ఇళ్లకుసీఆర్‌డీఏ ఆమోదం

Published on Mon, 04/03/2023 - 12:48

సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద అమరావతి ప్రాంతంలో 48,218 మంది పే­దలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిం­చారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా కార్యా­చరణ రూపొందించాలని అధికార యంత్రాం­గానికి సూచించారు. మే నెల మొదటి వా­రం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చ­ర్య­లు చే­ప­ట్టాలని నిర్దేశించారు. ఇళ్లులేని పే­ద­ల చి­ర­కాల వాంఛ నెరవేర్చే ఈ కా­ర్య­క్ర­మా­న్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరా­వ­తి­లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటా­యి­స్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ అ­ధ్య­క్షతన సోమవారం క్యాంపు కార్యా­ల­యంలో జరిగిన సీఆర్‌డీఏ 33వ సమావేశంలో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు. 

20 లేఅవుట్లు..
అమరావతి ప్రాంతంలో మొత్తం 20 లే­అ­వుట్లలో 1,134.58 ఎకరాల భూమిని పేద­ల ఇళ్ల కోసం కేటాయించారు. ఉమ్మడి గుంటూ­రు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలు ఉచితంగా ఇళ్ల పట్టాలు పొందను­న్నా­రు. ఐనవోలు, మందడం, కృష్ణాయ­పాలెం, న­వు­లూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతా­ల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుగా రా­ష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సీ­ఆర్డీఏ చట్టం సెక్షన్‌ 41(3), (4) ప్రకారం ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు చేసి భూములను ఆ ప­రి­ధిలోకి తెచ్చింది. గత ఏడాది అక్టోబరులో అ­భ్యం­తరాలు, సలహాలను స్వీకరించి సీఆర్‌­డీ­ఏ బహిరంగ విచారణ నిర్వహించింది. అనంత­రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇళ్ల ప­ట్టా­ల లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు త­యా­రు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా­ల కలె­క్టర్ల­ను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయ­పర­మై­న చిక్కులను పరిష్కరించి పే­ద­లకు ఇళ్ల పట్టాలు అందించేలా ప్రభుత్వం సన్న­ద్ధమైంది. సీఎం సమీక్షలో పురపాలక శాఖ మంత్రి సురేష్, సీఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ విజయానంద్, ఆర్‌­అండ్‌బీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమి­షనర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)