Breaking News

రామ్మోహన్‌ నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడా?

Published on Mon, 12/08/2025 - 03:40

సాక్షి, అమరావతి: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం పరిష్కరించడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుపై జాతీయ మీడియా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. ఇంత పెద్ద సంక్షోభం తలెత్తితే మంత్రి ఏం చేస్తున్నారు? నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారా, లేక రీల్స్‌ చేస్తున్నారా.. నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలు చూస్తున్నారా అంటూ కడిగిపారేస్తోంది. 

రిపబ్లిక్‌ టీవీలో ప్రెజెంటర్‌ ఆర్నాబ్‌ గోస్వామి లేవనెత్తుతున్న ప్రశ్నలకు బదులివ్వలేక తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడుతోంది. తొలుత.. రిపబ్లిక్‌ టీవీలో చర్చలో పాల్గొన్న దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ పరిస్థితిని నారా లోకేశ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. ఇందుకోసం వార్‌ రూమ్‌ని కూడా ఏర్పాటుచేశార’ంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో టీడీపీ అభాసుపాలైన విషయం తెలిసిందే. 

ఇక ఆదివారంకొమ్మారెడ్డి పట్టాభిరాంని పంపిస్తే దానికి రెండింతలు పరాభవం పార్టీ మూటగట్టుకుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇదే పెద్ద చర్చగా నడుస్తోంది. అర్నాబ్‌ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇద్దరూ నీళ్లునమిలారు.

ధైర్యం ఉంటే చర్చలో పాల్గొనమనండి..
పట్టాభిని అర్నాబ్‌ ఏమి అడిగారంటే.. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన కె. రామ్మోహన్‌నాయుడు విమానయాన మంత్రి శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారా అంటూ పట్టాభిని సూటిగా ప్రశ్నించారు. సమస్యను తెలుసుకోవడానికి విమానయాన శాఖ మంత్రికి నేను ఫోన్‌ చేస్తే.. హలో హలో అంటూ ఫోన్‌ పెట్టేస్తున్నాడని.. ధైర్యం ఉంటే ఈరోజు చర్చలో మంత్రి పాల్గొనాలంటూ పట్టాభికి సవాల్‌ విసిరారు. 

ఈ రోజు నా చర్చలో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ రెట్టించి అడిగారు. వెంటనే పట్టాభి కలుగజేసుకుని, మంత్రి సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారనగానే.. సమస్య పరిష్కారమంటే కూర్చుని నెట్‌ఫ్లిక్స్‌ వీడియోలు చూడటమా! అంటూ అర్నాబ్‌ గాలితీసేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని పట్టాభి చెప్పగా.. అయితే మీ మంత్రిని నా కాల్‌ లిఫ్ట్‌ చేయమనండి అంటూ అర్నాబ్‌ సవాల్‌ విసిరారు. 

ఈరోజు ఇంతమంది ప్రజలు ఇబ్బందులుపడుతుంటే దాన్ని తెలుసుకోవడానికి ఫోన్‌చేస్తే మీ మంత్రి హలో హలో అంటూ ఫోన్‌ పెట్టేస్తారా అంటూ మండిపడ్డారు. ఇలా రెండ్రోజులుగా జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు కావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ పరువు పోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.   

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)