Breaking News

రూ.పది లక్షల కోట్ల అప్పులున్నాయ్‌!

Published on Fri, 08/08/2025 - 05:58

సాక్షి, అమరావతి/మంగళగిరి: చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయ్‌.. రూ.పదిలక్షల కోట్లు అప్పులున్నా­య్‌.. వా టి­కి వడ్డీలు, అసలు కట్టడానికే ఇబ్బందిపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా­రు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌ వీవర్స్‌ కాలనీలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. సభలో సీఎం మాట్లాడుతూ.. మీ (బీసీలు) వల్లే అధికారంలోకి వచ్చానని, నా మొదటి ప్రాధాన్యం వెనుకబడిన వర్గాలేనని, కొ­న్ని వర్గాలు వస్తుంటాయి.. పోతుంటాయని పే­ర్కొ­న్నారు. 

ఇంకా వైకుంఠపాళీ ఆడొద్దని, మళ్లీ మళ్లీ డెవలప్‌ చేయాలంటే ఇంకా నాకు ఓపిక లేదన్నారు.  రాష్ట్రంలో బీసీల కోసం ఆదరణ–3 తెస్తామని, స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. నేతన్న భరోసా కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని సీఎం చెప్పారు.   

అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం 
చేనేత ఉత్పత్తులపై విధించే 5 శాతం జీఎస్టీని మొత్తం రూ.15కోట్లను ప్రభుత్వమే రీయింబర్స్‌ చేస్తుందని  సీఎం పేర్కొన్నారు. చేనేతలో 5,386 మందికి లబ్ధి కలిగేలా రూ.5 కోట్లతో పొదుపు నిధి(థ్రిఫ్ట్‌ ఫండ్‌) ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని, మంగళగిరిలో పార్కుకు ఆయన పేరుపెట్టి, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.  

బ్రాహ్మణి కట్టిన చీరనే 98 మంది కొన్నారు : లోకేశ్‌ 
రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు నడుస్తుంటే.. మంగళగిరిలో మాత్రం మోదీ, బాబు, లోకేశ్‌తో కూడిన ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కారు నడుస్తోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ‘బ్రాహ్మణి మంగళగిరి చేనేత చీర కట్టిన తర్వాత ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అలాంటి చీరనే 98 మంది కొనుగోలు చేశారు’ అని లోకేశ్‌ పేర్కొన్నా­రు. 

పేదరిక నిర్మూలన కోసమే పీ–4 
సాయం చేస్తే సంతృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో గురువారం పీ–4పై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేదరిక నిర్మూలన కోసమే పీ–4 అని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్‌ రెడ్డి ఓ మండలంలో 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.  

నవ్వులపాలైన నారా లోకేశ్‌.. 
టాస్క్ ఫోర్స్‌ :  ఎప్పటిలాగే మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తప్పులో కాలేశారు. మంగళగిరిలో గురువారం చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించారు. ఆ మాటల ప్రవాహంలో పాపం నవ్వులపాలయ్యారు. ‘2019 ఎన్నికల్లో.. నేను మంగళగిరిలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, అయితే, నన్ను 2024 ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించమని కోరాను. 

కానీ, ఏకంగా 91 వేల నాలుగు వందల 13 వేల మెజారిటీతో గెలిపించార’ని నోరుజారి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 91 వే­ల నాలుగు వందల 13 వేలు ఏంట్రా బాబూ అంటూ సభకు వచ్చిన వారు తలపట్టుకుని నవ్వుకున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)