Breaking News

విశాఖ పశు వైద్యుడికి జాతీయ అవార్డు

Published on Mon, 09/25/2023 - 05:56

ఆరిలోవ(విశాఖ తూర్పు):  విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా పనిచేస్తున్న డాక్టర్‌ మాదిన ప్రసాదరావు జాతీయ స్థాయి అవా­ర్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు, పశు పోషణలో నూతన ఆవిష్కరణలపై ఆయన పాడి రైతులకు అవగాహన కల్పించడంలో చేసిన విశేష కృషికి గాను ‘ఉత్తమ విస్తరణ అధికారిగా’ జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారత ప్రభుత్వ సంస్థ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆధ్వర్యంలో జరగనున్న జాతీ­య సదస్సులో ఈ అవార్డును అందుకోనున్నారు.

ప్రస్తుతం డాక్టర్‌ ప్రసాదరావు విశాఖ జిల్లా పశు సంవర్థకశాఖ కార్యాలయంలో ఏడీగా పని­చేస్తున్నారు. ఆయన ఇక్కడ శిక్షణ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యు­డిగా ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించు­కునేలా చేయడం, పాడి పశువులు, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంలో కృషి చేస్తున్నారు.

దీంతో పాటు ప్రభుత్వ పథకాలపై ఆయన లఘు చిత్రాలు, స్వీయ రచనలు చేయడంతో పాటు వీడియోలు రూపొందించారు. వాటి ద్వారా పాడి రైతులకు సులువైన పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంతవరకు ఆయన ఆరు పుస్తకాలు, 200 పైగా వ్యాసాలు రాశారు. ప్రసాదరావు మాట్లాడుతూ యూ ట్యాబ్‌ చానల్‌ పెట్టి 140 వీడి­యోలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.   

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)