Breaking News

తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం

Published on Sun, 10/13/2024 - 07:17

ఆరిలోవ (విశాఖ జిల్లా): అతను మరణిస్తున్నా.. మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి జిల్లాకు చెందిన నరేష్‌ పట్నాయక్‌ (32) రెండు రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే బంధువులు పర్లాకిమిడిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

పరీక్షలు చేసిన వైద్యులు... నరేష్‌ పట్నాయక్‌ బ్రెయిన్‌లో తీవ్ర రక్తస్రావమైందని, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా, ఇక్కడ వైద్యులు రెండు రోజులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గుర్తించారు.

జీవన్‌దాన్‌ ప్రతినిధులు నరేష్‌ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు.బాధను దిగమింగుకుని నరేష్‌ కుటుంబ సభ్యు­లు అవయవదానానికి అంగీకరించారు. ఆస్పత్రిలో వైద్యులు శుక్రవారం నరేష్‌ దేహం నుంచి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివర్‌ తొలగించారు. వాటిని జీవన్‌దాన్‌ ప్రొటోకాల్‌ ప్రకా­రం ఐదుగురికి కేటాయించారు. గ్రీన్‌ చానెల్‌ ద్వారా వాటిని అవసరమైనవారికి వెంటనే తరలించినట్లు జీవన్‌దాన్‌ రాష్ట్ర కో–ఆర్డినేట­ర్‌ డాక్టర్‌ రాంబాబు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)