Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్‌ మీడియం భేష్‌

Published on Sun, 08/20/2023 - 05:36

తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యావిధానం ప్రవేశపెట్టడం ద్వారా జ్యోతిరావు పూలే, బీఆర్‌ అంబేడ్కర్, పెరియార్‌ రామస్వామి వంటి మహానుభావుల ఆశయాలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. తాను దర్శకత్వం వహించి  నిర్మించిన ‘యూనివర్సిటీ’ సినిమా ప్ర­మో­­షన్‌లో భాగంగా శనివారం తిరుపతి వచ్చిన ఆ­య­న మాట్లాడుతూ.. తెలుగు భాష అమ్మ అయితే.. ఇంగ్లిష్‌ భాష నడిపించే నాన్న అని, జీతం, జీవి­తం  ఇంగ్లిష్‌పై ఆధారపడి ఉందని అన్నారు.  

భక్తుల రక్షణకు కర్ర ఓ ఆయుధం 
తిరుమల కాలినడక మార్గంలో క్రూర మృగాలు   భక్తుల ప్రాణాలు తీయడం మనసును కలచివేసిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. నడకదారి భక్తులకు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించడం ఆహా్వనించదగ్గ విషయమన్నారు. అడవులకు, పొలాలకు వెళ్లే సమయంలో అడవి జంతువుల నుంచి తమకు తాము కాపాడుకోవాలంటే కర్రనే ఉపయోగించారని చెప్పారు.

కర్ర పైకి ఎత్తి మనిషి గాండ్రిస్తే ఎంతటి క్రూర మృగమైనా పారిపోవాల్సిందేనన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా వీలైతే సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, విద్యావ్యవస్థ, నిరుద్యోగ సమస్య, పేద విద్యార్థుల, తల్లిదండ్రుల వేదన, నిరుద్యోగ భారతం కాదు ఉద్యోగ భారతం కావాలని, విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలనే విషయాలు ప్రధానాంశాలుగా యూనివర్సిటీ సినిమా తీశానని, అక్టోబర్‌ 4న విడుదల కానుందని చెప్పారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)