Breaking News

మాకు ఇదేమి ఖర్మ నారాయణా..!

Published on Sun, 03/10/2024 - 03:49

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భారీగా ఫీజులు చెల్లించి తమ విద్యా సంస్థల్లో పిల్లలకు మంచి విద్యను అందించాల్సిన టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన స్కూళ్లు, కాలేజీలను రాజకీయాలకు వేదికగా మార్చేశారు. చంద్రబాబు బినామీగా, టీడీపీ నేతగా, మాజీ మంత్రిగా చిరపరిచితుడైన నారాయణ ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నారాయణ విద్యా సంస్థల్లోనే రాజకీయ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు.

సంస్థలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఎన్నికల పనులు చేయిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్ఛిన ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. ఈ దఫా ఓటు టీడీపీకే వెయ్యాలని ప్రాథేయపడేలా చేస్తున్నారు. 

బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి.. 
2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన నారాయణ నాలుగున్నరేళ్లపాటు నెల్లూరుకు ముఖం చాటేశారు. ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో ఈసారి టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన విద్యాసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి లాగారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, ఉద్యో­గులను రోజువారీ విధుల నుంచి తప్పించి ఎన్నికల విధులు అప్పజెప్పినట్లు సమాచారం. దా­దాపు 500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిపి నారాయణ టీం (ఎన్‌ టీం)గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఆ బృందంతో గతంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల వెరిఫికేషన్‌ చేయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్‌కొచ్చే ఓటీపీ అడగడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా, నారాయణ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు నగర, రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తున్నారు. 

ప్రతి రోజూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి.. 
ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల అడ్రెస్‌లు సేకరించి, ఒక్కొక్కరూ రోజుకు  ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. తల్లిదండ్రులతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ దఫా ఓట్లు టీడీపీకే  వేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే తమ యాజమాన్యం ఒత్తిడిపై వచ్చామని, ఏమీ అనుకోవద్దని ప్రాధేయపడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు దిగి విద్యా సంస్థల వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. 

మాట వినకపోతే డిస్మిస్‌ లేదా బదిలీ 
ఉన్నత చదువులు చదివిన తమకు వేతనం తక్కువైనప్పటికీ గౌరవప్రదమైన ఉద్యోగం అని చెప్పుకునేందుకు ఎక్కువ మంది నారాయణ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఏళ్ల తరబడి అదే సంస్థలో పని చేస్తున్నారు. నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్ఛిన 2019 నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ పనులకు వాడుకుంటున్నారు.

ఉద్యోగులను భయపెట్టి మరీ ఎన్నికల పనులు చేయిస్తున్నారని విద్యాసంస్థ ఉద్యోగులు, ఉపా«­ద్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా­రు. ఇందుకు తిరస్కరించిన ఉద్యోగులను పలు సాకులతోఉద్యోగం నుంచి తొలగించడమో, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడమో చేస్తున్నారని ఓ ఉద్యోగి వాపోయారు.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)