Breaking News

నారా లోకేష్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్

Published on Thu, 05/18/2023 - 13:01

సాక్షి, నంద్యాల జిల్లా: భుజం నొప్పితో నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన నారా లోకేష్.. ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించుకున్నారు. యువగళం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆయన కొద్ది రోజులుగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. రెండు మూడు రోజులుగా ఈ నొప్పి సంక్లిష్టంగా మారడంతో వైద్యుల సూచన మేరకు నంద్యాలలోని మాగ్నా MRI సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు. 

జనవరి 27, 2023న యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ నాయుడు.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడుస్తానని ప్రకటించారు. ఇప్పటివరకు 3 జిల్లాల్లో పర్యటించిన లోకేష్ అష్టకష్టాలు పడుతున్నారు. పెద్దగా ప్రజల నుంచి స్పందన లేకపోవడం ఆయన్ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఎలాగైనా వాడి వేడి ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకోవాలని లోకేష్ చేస్తోన్న ప్రయత్నాలు కూడా చాలా సార్లు బెడిసికొడుతున్నాయి.

పదాలను స్పష్టంగా పలకలేకపోవడం, వ్యాక్యాన్ని చెప్పలేకపోవడం, ఏ విషయం చెబుతున్నాడో దానిపై పూర్తిగా అవగాహన లేకపోవడం, చెప్పే మాటల్లో నిలకడలేమి ఉండడం, చేసింది ఒకటయితే.. దానికి విరుద్ధమైన ప్రకటనలు చేయడం, నేరుగా విమర్శించలేక.. తిట్ల దండకం అందుకోవడం.. ఇవన్నీ పాదయాత్రలో చినబాబు బయటపెట్టుకున్న అంశాలు. దీనికి తోడు పలుమార్లు "సైకిల్ పోవాలి" అంటూ నోరు జారడం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. పైగా తనను తాను మూర్ఖుడని బలంగా చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థిని భయపెట్టే క్రమంలో నిజాలు చెప్పాలి, ఆధారాలు చూపించాలి కానీ.. వాటిని వదిలి తిట్ల దండకం అందుకోవడం, మూర్ఖుడినని చెప్పుకోవడం, తనకు అవకాశం ఇస్తే అంతు చూస్తానని వ్యాఖ్యానాలు చేయడం ద్వారా గతంలో ఉన్న ఇమేజ్ కూడా ఇప్పుడు పోయినట్టయింది. 

దానికి తోడు ఇప్పటివరకు వెళ్లిన చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు రచ్చకెక్కడం, గ్రూపులుగా విడిపోయి వ్యూహాలు, ప్రతివ్యూహాలు, దాడులు చేసుకోవడం, అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఇమేజ్ ను మరింత దెబ్బ తీసినట్టవుతోంది. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)