Breaking News

మా భూములు తీసుకుంటే సహించేది లేదు

Published on Tue, 01/13/2026 - 05:26

గుంటూరు వెస్ట్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు పేరుతో చిన్న, సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల పాల్జే­స్తోందని, ఖరీదైన పొలాలు రింగ్‌ రోడ్డులో పోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండ­లం నారా కోడూరు ప్రాంత రైతులు సుమా­రు 150 మంది సోమవారం గుంటూరులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకుని చంద్రబాబు సర్కారుపై ఫిర్యాదు చేశారు. నారా కోడూరు ప్రాంతంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు పేరిట సుమారు 650 ఎకరాల పచ్చని పొలాలను అక్ర­మంగా తీసుకుంటున్నారని వారు వాపోయారు. ఈ రోడ్డుకు సుమారు 80 ఎకరాలు అవసరం అవుతుందని, అంతవరకు ఇవ్వ­డానికి తమ­కు ఇబ్బంది లేదని చెబుతున్నారు.

అయితే అవసరం లేకపోయినా పచ్చని పొలాలను తీసుకుంటే సహించేది లేదంటున్నారు. 2014–19 కా­లంలో రాజధాని పేరిట సుమారు 35 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకుని వారిని ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లా రైతు­లను ఇబ్బందులు పెట్టలేదని.. జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూ­ములకు క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లించారని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు ఇతర నాయకులను కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరుతామని చెబుతున్నారు.   

రాజకీయ క్రీడ ఆడుతున్నారా ? 
ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నారా కోడూరు ప్రాంత రైతులను కలిసి వివరాలు అడిగా­ర­ని రాంబా­బు అనే రైతు తెలిపాడు. రైతుల తరఫున పో­­రాటం చేస్తామన్నారని.. అయితే వారికి తెలియకు­ండానే భూ­ములకు మార్కింగ్‌ జరిగిందా? అని ని­ల­­దీస్తున్నారు. తమతో రాజకీయ క్రీడలు ఆడి­తే భవిష్య­త్‌ గల్లంతేనని హెచ్చరిస్తున్నారు. చిన్న, సన్న­కారు రైతులపై ప్రభు­త్వం ఎందుకు కక్ష కడుతుందో అర్థం కా­వ­డం లేదంటు­న్నారు. గ్రామసభ కూ­డా నిర్వహించకు­ండా, రైతు­లకు చెప్పకుండా భూ­ములు తీసుకుంటామనడం దా­రు­ణమన్నారు. రైతుల ఉసు­రు తగిలితే ప్రభుత్వా­లు మనుగడ సాగించలేవని రైతులంతా చెబుతున్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు