Breaking News

నంబాల ఫ్యామిలీకి మంత్రి అచ్చెన్న బెదిరింపులు

Published on Mon, 05/26/2025 - 14:14

శ్రీకాకుళం, సాక్షి: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు దిగారు. ఆయన తమను బెదిరించారని, తమ సోదరుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించకుండా అడ్డుపడుతున్నారని ఢిల్లీశ్వరరావు సాక్షి టీవీతో వాపోయారు.  

పోలీసులు ముందు నుంచే మమ్మల్ని బెదిరిస్తున్నారు. నంబాల మృతదేహం(Nambala Dead body) కోసం వెళ్ళిన మమ్మల్ని బలవంతంగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్ర బోర్డర్‌కు పంపించేశారు. మా సోదరుడు నంబాల రాజశేఖర్‌కు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఫోన్ చేసి బెదిరించారు. ‘నా అనుమతి లేకుండా ఛత్తీస్‌గఢ్‌ ఎవరు వెళ్ళమన్నారు? వెంటనే వెనక్కి వచ్చేయండి. లేకపోతే మీరే సమస్యల్లో చిక్కుకుంటారు’ అని మా కుటుంబ సభ్యులను అచ్చెన్నాయుడు బెదిరించారు. 

.. దీంతో మా వాళ్లు భయపడ్డారు. అచ్చెన్నాయుడు నాకు ముందు నుంచే తెలుసు కానీ ఇలా మా సోదరుడి మృతదేహాం విషయంలో ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అని నంబాల సోదరుడు ఢిల్లీశ్వరావు అన్నారు.  హైకోర్టు కూడా మృతదేహాన్ని అప్పగించాలని ఆదేశించినా కూడా మంత్రి, పోలీసులు అడ్డుకుంటున్నారు. 

.. ఫ్యామిలీ ఫోటో చూపించండి, ఆధార్ కార్డ్ చూపించమంటూ ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు(Chhattisgarh) ఇబ్బంది పెట్టారు. మృతదేహాన్ని అప్పగించండి అని అడిగితే మమ్మల్ని మావోయిస్టు ఫ్యామిలీ గా చూస్తూ ఇవ్వట్లేదు. అలా చూస్తే మమ్మల్ని కూడా కాల్చి చంపేయండి. నా సోదరుడి మృతదేహం చూసేందుకు కుటుంబం మొత్తం ఎదురు చూస్తోంది. దయచేసి మా తమ్ముడి మృతదేహం మాకు అప్పగించండి అని కోరుతున్నారాయన.

ఇదీ చదవండి: నంబాల మృతదేహం అప్పగింతలో జాప్యమెందుకు?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)