Breaking News

సాగర్‌ 4 గేట్ల నుంచి దిగువకు నీరు

Published on Fri, 08/26/2022 - 05:09

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌: శ్రీశైలం జలాశయం రేడియల్‌ క్రస్ట్‌గేట్లను గురువారం సాయంత్రం మూసేశారు. మంగళవారం ఇన్‌ఫ్లో పెరగడంతో నాలుగోసారి బుధవారం గేట్లను ఎత్తిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో గురువారం ఉదయం 9 గంటలకు ఒక గేటు, మధ్యాహ్నం మూడుగంటలకు ఒక గేటు, సాయంత్రం ఆరుగంటలకు మరో గేటు మూసేశారు. జూరాల, సుంకేసుల నుంచి జలాశయానికి 96,467 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

విద్యుత్‌ ఉత్పాదన అనంతరం 64,048 క్యూసెక్కులు, స్పిల్‌ వే ద్వారా 72,569 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు. బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 18 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజలస్రవంతికి 1,688 క్యూసెక్కు లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,186 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీరు ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది.

నాగార్జునసాగర్‌ జలాశయం నాలుగు రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ను ఐదడుగులు ఎత్తి  దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,454 క్యూసెక్కులు, నాలుగు గేట్ల ద్వారా 32,316  క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ, వరద కాలువలు, ఎస్‌ఎల్‌బీసీకి కలిపి మొత్తం 1,03182 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం సాగర్‌ జలాశయంలో నీటిమట్టం 589.80 అడుగులు ఉంది. 311.4474 టీఎంసీల నీరు ఉంది. 

Videos

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)