Breaking News

తెలుగువారి జీవధారకు 69 వసంతాలు

Published on Mon, 12/09/2024 - 05:56

విజయపురిసౌత్‌: నాటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రేపటితో 69 ఏళ్లు నిండుతాయి. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అన్నపూర్ణగా ఆధునిక దేవాలయంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. 1955 డిసెంబర్‌ 10న ఆనాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఆయన మాట్లాడుతూ ఈనాడు నాగార్జున సాగరానికి నేనిక్కడ జరిపే శంకుస్థాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికి జరుగుతున్న శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవ­దే­వాలయాలకు ఇది చిహ్నం’ అని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో  పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ప్రాజెక్టు నాగార్జునసాగర్‌. 

సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్‌ కాలువగా, ఎడమకాలువను లాల్‌బహదూర్‌ కాలువగా పిలుస్తారు. జవహర్‌ కాలువ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్‌ 10న ప్రారంభించారు. దక్షిణ విజయపురి (రైట్‌బ్యాంకు) వద్ద  ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. 

ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్‌ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకే లాల్‌బహదూర్‌ కెనాల్‌ అని పేరు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని ఆనాటి గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ 1959లో ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349కిలోమీటర్లు. 

ఈ కాలువ కింద 10 లక్షల 37వేల 796 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్‌ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడికాలువలాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయవచ్చు. సాగర్‌ ప్రాజెక్టు ఒకసారి నిండితే ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయలకు పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు.  

సాగర్‌ జలాశయం విస్తీర్ణం,110 చదరపు మైళ్లు
గరిష్ట నీటిమట్టం    590 అడుగులు
డెడ్‌ స్టోరేజి లెవల్‌    490 అడుగులు
నీటి నిల్వ 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312.0. టీఎంసీలు)
డెడ్‌స్టోరేజినీరు 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో  168 టీఎంసీలు)
నీటివిడుదలకు కనీస నీటిమట్టం 510 అడుగులు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)